ర్యాగింగ్‌ను నిరోధిద్దాం

ర్యాగింగ్‌ను  నిరోధిద్దాం


జడలు విప్పుతున్న భూతం

ఆందోళనలో   తల్లిదండ్రులు

కట్టడిలో కళాశాలల పాత్ర కీలకం

త్వరలో ఇంజినీరింగ్ కాలేజీలు షురూ..


 

పరిచయ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నారుు.. అండగా ఉండాల్సిన వారే అఘాతంలోకి తోస్తున్నారు. వికృతక్రీడతో విషాన్ని చిమ్ముతున్నారు. ఇలా.. విద్యా సమూపార్జన దశలో కొందరు విగతజీవులవుతున్నారు. అవమానభారంతో చనిపోయే విద్యార్థి ప్రాణాన్ని కోల్పోతుండగా, దీనికి బాధ్యులు ఉజ్వల భవిష్యత్‌ను పణంగా పెట్టాల్సివస్తోంది. ర్యాగింగ్ భూతం దుష్పరిణామాలివీ. మొన్న హన్మకొండకు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో  బలవన్మరణం.. నెల్లూరులో ఇంటర్ విద్యార్థి కె. మధువర్ధన్‌రెడ్డి మృతి నేపథ్యంలో అందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి.  

 

 పోచమ్మమైదాన్:  మొదట్లో కళాశాలలకు కొత్తగా వచ్చే విద్యార్థులను సీనియర్లు పరిచయం చేసుకునేందుకు ఫ్రెషర్స్ పార్టీలు జరిగేవి. ఇవి రానురాను ర్యాగింగ్‌గా మారారుు. కొందరి వ్యవహార శైలి అందరికీ చేటు తెస్తోంది. సామరస్య పూర్వక వాతావరణంలో జరగాల్సిన పరిచయ కార్యక్రమాలు రాత్రివేళల్లో గదుల్లో.. అమాయకులను భయపెట్టేలా, బాధపెట్టేలా వికృతరూపం దాల్చుతున్నారుు. ఈ కారణంగా పలువురు ఆత్మన్యూనతభావంతో కళాశాలలను వీడుతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నెల 6న ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది.



 మరేం చేయాలి?

 కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పుడే యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించాలి. ఇందులో అధ్యాపకులతో పాటు సీనియర్లు, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. ర్యాగింగ్ చేస్తే విధించే జరిమానా, పడే శిక్షలు, విద్యాసంవత్సరం నష్టపోయే తీరు.. తల్లిదండ్రులకు కలిగే దుఖం తదితర అంశాలు అందరికీ తెలిసేలా తరగతి గదులు, హాస్టళ్ల ఆవరణల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి. పోలీసు అధికారులు, మానసిక నిపుణులు, గతంలో ర్యాగింగ్ వల్ల నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పలు సమావేశాల్లో చెప్పించాలి. విద్యార్థులు కళాశాలలో చేరినప్పుడే స్టాంప్ పేపర్‌పై బాండ్లు రాయించుకోవాలి. ర్యాగింగ్ బాధ్యులుగా తేలితే ఫీజు వాపస్ ఇవ్వబోమని, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేయూలి. కళాశాల నుంచి డిబార్ తదితర చర్యలు తీసుకున్నా ఒప్పుకుంటామని తల్లిదండ్రులు, విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటే కొంత వరకు కట్టడి చేయొచ్చు. ఈ విధానాన్ని నగరంలోని చాలా కళాశాలల్లో అమలు చేస్తున్నారు.



 విద్యార్థుల్లోనే మార్పు రావాలి

 తాము గతంలో జూనియర్లమేననే స్ప­ృహ సీనియర్లకు ఉండాలి. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వారసత్వంగా జూనియర్లకు ఆపాదించొద్దు. అజమారుుషీకి ప్రయత్నించొద్దు. పెద్ద మనిషి తరహాలో, మార్గదర్శిగా మాత్రే ఉంటేనే హుందాతనం. ఎక్కువగా మహిళ హాస్టళ్లలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ మాత్రం క్షేమకరం కాదు.



 ఇబ్బంది ఎదురైతే..

 ర్యాగింగ్‌కు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాంపస్‌లో కానీ హాస్టళ్లలో కానీ ఒంటరిగా కాకుండా తోటి వారితో కలిసి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు లేదా తల్లిదండ్రులకు సమాచారమివ్వాలి. ప్రతి కళాశాలలో సమీప పోలీస్ స్టేషన్ వారు హెల్ప్‌లైన్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. నిత్యం అందులో విద్యార్థులు వేసే విజ్ఞాపన పత్రాలను పరిశీలించాలి.



 సాంకేతికంగా     అభివృద్ధి చెందడమేనా?

 ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడమూ కారణమని పలువురి అభిప్రాయం. ఇప్పుడంతా ఇంటర్నెట్ హల్‌చల్ చేస్తున్న రోజులు. ర్యాగింగ్ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి సామాజిక వెబ్‌సైట్లలోకి పంపడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

 

విద్యా సంస్థల బాధ్యత


విద్యా సంస్థలలో తెలంగాణ ప్రొబిషన్ యాక్ట్  1997/26 ప్రకారం కి ంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.విద్యాసంస్థలో ఏ రూపంలో ర్యాగింగ్ జరిగినట్లు దృష్టికి వస్తే విస్మరించొద్దు.  ర్యాగింగ్ చేస్తూ దొరికిన,ర్యాగింగ్‌ను ప్రో త్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. యూజమాన్యం వారు ఆడియో విజువల్ ద్వారా ర్యాగింగ్ నిషేధిత, బాధ్యులపై తీసుకునే చర్యలను ప్రసారం చేయూలి.  

     

యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో సీనియర్లు, జూనియర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ను చేర్చాలి. వారి ఫోన్ నంబర్లు, సమీప ఠాణా సీఐ, ఎస్సై ఫోన్ నంబర్లు రాసి ఉంచాలి.అడ్మిషన్ తీసుకునే సమయంలోనే విద్యార్థితో వాంగ్మూల పత్రం తీసుకోవాలి. మరోక వాంగ్ముల పత్రం తల్లితండ్రుల నుంచి సైతం తీసుకోవాలి. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారమివ్వాలి.

 

ర్యాగింగ్ చేస్తే శిక్షలు

 తోటి విద్యార్థిని వేధించినా, ఆత్మన్యూనతకు గురిచే సినా ఆర్నెల్ల జైలు, రూ. వెరుు్య జరిమానా.దాడి , క్రిమినల్ చర్యలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా.అక్రమ నిర్బంధం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా. తీవ్రంగా గాయపరచడం, లైంగికదాడి, కిడ్నాప్ వంటి అసాధారణ చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా.  హత్య చే సినా, ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు, రూ. 50 వేల వరకు జరిమానా. రెండూ విధించవచ్చు.

 

అకడమిక్ చర్యలు

 చట్టం నిర్దేశించిన శిక్షలే కాదు.. మరికొన్ని శిక్షలూ పడతారుు.ర్యాగింగ్ చేసిన విద్యార్థి తరగతులకు రానివ్వకుండా నిషేధించాలి. అడ్మిషన్ రద్దు చేయాలి. బాధ్యుడు పరీక్ష రాసి ఉంటే ఫలితాలను ఆపివేయాలి.

 

అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం

వరంగల్‌లోని అన్ని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, మెడికల్ కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యల తీవ్రత ఏ స్థారుులో ఉంటుందో సీనియర్ విద్యార్థులకు వివరిస్తాం. ఆయూ కళాశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక బ్యానర్లు కట్టిస్తాం. కుటుంబం నుంచే విద్యార్థులపై ర్యాగింగ్ వ్యతిరేక భావన అలవర్చాలి.

 -సురేంద్రనాథ్, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్

 

 సీనియర్లకు అవగాహన కల్పిస్తున్నాం

 ఏటా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్ చేస్తే ఊరుకునేది లేదు. తరచూ సీనియర్లకు ఈ మేరకు అవగహన  కల్పిస్తున్నాం. త్వరలో మా కళాశాలకు జూనియర్లు రానున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే సీనియర్లను మోటివేట్ చేస్తున్నాం. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా చుస్తున్నాం.

 -డాక్టర్ శ్యామల, అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల

 

 కఠినంగా శిక్షించాలి

 ర్యాగింగ్ చేస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారినైనా కఠినంగా శిక్షించాలి. కళాశాలల యూజమాన్యాలు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలి. పోలీసులు సైతం నిఘా పెట్టాలి. విద్యార్థులకు అవగహన సదస్సులు ఏర్పాటు చేయాలి. పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా!

 -కూనురు శ్రీమతి- శేఖర్ గౌడ్

 

 ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి


 ర్యాగింగ్ భూతాన్ని విద్యార్థులు తరిమికొట్టాలి. కేయూలో క్యాష్(కమిటీ అగెనెస్ట్ సెక్స్‌వల్ హరాస్‌మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలి. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి అందులో విద్యార్థులు, అధ్యాపకులను, విద్యార్థి సంఘాలను సభ్యులుగా చేర్చాలి. కళాశాలల యూజమాన్యాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేయూలి.

 - చిలువేరు శ్రీకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

 

 అలాంటి వారితో జాగ్రత్త


 విద్యార్థుల్లో 3 నుంచి 5 శాతం మంది సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారే ర్యాగింగ్‌కు పాల్పడుతుంటారు. యుక్త వయస్సులో కీజోఫియా అనే వ్యాధి కూడా వీరిని అలా ప్రేరేపిస్తుంది. వీళ్లు వ్యక్తిత్వం, సంబంధాలను అర్థం చేసుకోలేరు. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేసుకోలేరు. మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతారు. ఇలాంటి వారితో జూనియర్లు జాగ్రత్తగా ఉండాలి.

 -డాక్టర్ యైశ్రీధర్ రాజు, సైక్రియూట్రిస్టు

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top