ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు

ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు - Sakshi


ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారంతో ముగిశాయి. సంవత్సరంపాటు పుస్తకాలతో కుస్తీ పట్టి చివరి రోజు పరీక్ష రాసిన విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు తోటి స్నేహితులతో ముచ్చటిస్తూ సంతోషంలో మునిగి తేలారు. పరీక్షలు ఎలా రాశావు అంటూ విద్యార్థులు ఒకరినొకరు పలుకరించుకున్నారు. తోటి విద్యార్థుల చిరునామా తీసుకుని ఇంటిముఖం పట్టారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు వారి స్వగ్రామాలకు బయలుదేరారు. విద్యార్థులతో బస్టాండ్‌ కిటకిటలాడింది.


మొత్తం మీద పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఉపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు మొత్తం 9,991 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 9,871 మంది హాజరయ్యారని డీఈవో లింగయ్య తెలిపారు. అన్ని పరీక్షల్లో కలిపి ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఒక విద్యార్థి మాత్రమే డిబార్‌ అయ్యాడు.

ఏప్రిల్‌ 3 నుంచి మూల్యాంకనం

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 3 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో లింగయ్య తెలిపారు. స్పాట్‌ కేంద్రాన్ని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసఫ్‌ కాన్వంట్‌ స్కూల్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి మూల్యాంకనం కోసం 6 లక్షల జవాబు పత్రాలు వచ్చాయని తెలిపారు. ఇందు కోసం మొత్తం 2,300 ఉపాధ్యాయులకు విధులు కేటాయించామని అన్నారు. 500 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు, 300 మంది సీఈలు, 1500 మంది ఏఈలను నియమించినట్లు పేర్కొన్నారు. స్పాట్‌ విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించారు.    

సౌకర్యాలు అంతంతే..

ఇదిలా ఉంటే ఎక్సైజ్‌ శాఖ స్టేషన్లలో అసౌకర్యాలు వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కొనసాగిన డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఇటీవలే టీచర్స్‌ కాలనీలోని మరో అద్దె ఇంట్లోకి మార్చారు. ఇలా చాలా చోట్ల ఎక్సైజ్‌ స్టేషన్ల అవసరాల కోసం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. దీనికితోడు టీఏ, డీఏ బిల్లులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నిర్మల్, ఆసిఫాబాద్‌లలో ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందికి కనీసం వాహనాలు కూడా లేవు.


ఉమ్మడి జిల్లాలోని భోరజ్, భైంసా, లక్ష్మీపూర్, గన్‌పూర్, వాంకిడి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేసేందుకు రోజం తా ఉన్నప్పటికీ అక్కడ గదులు లేకపోవడంతో చెట్ల కింద పడిగాపులు కాయాల్సి వస్తోందని పేర్కొం టున్నారు. కోట్లలో ఆదాయం ఇస్తున్నప్పటికీ తమకు కనీ సం సదుపాయాలు కల్పించడం లేదని సిబ్బంది వా పోతున్నారు. సొంత భవనాలు ఏర్పాటు చేయడంతోపాటు ఎక్సైజ్‌స్టేషన్‌ల నిర్వహణ ఖర్చుల కింద రూ.50వేల చొప్పున కేటాయించాలని కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top