బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ

బియాస్ నదిలో లభించిన శ్రీనిధి ఆచూకీ


కన్నీటి నిరీక్షణకు తెర

- 42 రోజులుగా దు:ఖసాగరంలో తల్లిదండ్రులు

- నేడు రేకుర్తికి మృతదేహం


కరీంనగర్ రూరల్ : కన్నకూతురు మృతదేహాన్ని కడసారి చూడాలనే ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడింది. 42 రోజుల సుదీర్ఘ ఎదురు చూపుల అనంతరం ఆదివారం బియాస్ నదిలో కూతురు మృతదేహం లభించిందనే సమాచారంతో ఇన్నాళ్లూ దిగమింగిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కుటుంబమంతా కన్నీటి సంద్రమైంది. కన్నకూతురు మృతదేహం రేకుర్తికి తీసుకరావడానికి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు.

 

గత నెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో వరద ఉధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 24 మంది విద్యార్థులు నదిలో గల్లంతు కావడంతో శ్రీనిధి అచూకీ కోసం ఆమె తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. కూతురు ఆచూకీ కోసం నది ఒడ్డున పదిరోజులపాటు పడిగాపులు కాశాడు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి కొద్ది రోజులపాటు అక్కడే ఉండి గా లింపును పర్యవేక్షించారు. మంచుకొండలు కరిగి నదిలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.



రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టగా గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో 21 మృతదేహాలు లభించా యి. ఒక్కొక్క మృతదేహం బయటపడుతున్న కొద్దీ అది తమ కూతురుదేమోననే ఆతృతతో వెళ్లి చూడడం... ఆమెది కాదని తెలిసి నది ఒడ్డున విషాదవదనంతో ఎదురుచూపులు చూడడం రాజిరెడ్డికి నిత్యకృత్యమైంది. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలను నిలిపివేసినట్లు ప్రకటి ంచింది. గల్లంతైన విద్యార్థుల పేరిట డెత్ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఒకవేళ మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు పంపిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కూతురు ఆచూకీపై రాజిరెడ్డి ఆశ లు వదులుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరినీ అక్కడి నుంచి తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజిరెడ్డి గత నెల 20న స్వగ్రామం రేకుర్తికి తిరిగి వచ్చాడు.



అప్పటి నుంచి శ్రీనిధి జ్ఞాపకాలతో ఆమె మృతదేహం ఆచూకీ కోసం రాజిరెడ్డి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం బియాస్‌నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో లభించిన రెండు మృతదేహాల్లో ఒకటి శ్రీనిధిగా గుర్తించినట్లు అధికారులు ప్రకటించడంతో తల్లిదండ్రులు రాజిరెడ్డి, అనంతలక్ష్మి, అక్క తేజతోపాటు బంధువుల్లో దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. శ్రీనిధి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించడానికి అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు. కూతురు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి రాజిరెడ్డి సమీప బంధువులతో కలిసి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మృతదేహం రేకుర్తికి వచ్చే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top