సీవీఆర్‌లో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

సీవీఆర్‌లో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

హైదరాబాద్‌:  కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా నిర్వహించే  స్మార్ట్‌ ఇండియా హ్యాక్‌థాన్‌ 2017 జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్‌ సదస్సుకు నగరంలోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వేదిక కానుంది. కేంద్రం స్టార్ట్‌ అప్‌ ఇండియా- స్టాండ్‌ అప్‌ ఇండియా అనే నినాదంతో చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా లో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సామూహిక సదస్సును ఏప్రిల్‌ 1,2 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, కళాశాల సౌకర్యాల ఆధారంగా నోడల్‌ సెంటర్లును ఎంపిక చేశారు.

 

తెలంగాణ నుంచి సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఎంపికయింది. ఈ సదస్సులో ఒక్కో సెంటర్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలకు తలెత్తిన సమస్యలను విద్యార్థులు తమ సాంకేతిక పరిజా​‍్ఞనంతో పరిష్కారాన్ని అందించనున్నారు. జాతీయ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రోగ్రామింగ్‌ సమస్యలను పరిష్కరించే సెంటర్‌గా సీవీఆర్‌ ఎంపికయింది. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రోగ్రామింగ్‌ రూపొందించనున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ దివ్యాంగులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే ఉపకార వేతనాలు అర్హులకు అందే విధంగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 2 సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కోనసాగుతుంది. కార్యక్రమ అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశాస్తారు. దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే సదస్సుకు తమ సంస్థ వేదిక కావడం సంతోషంగా ఉందని సీవీఆర్‌ యాజమాన్యం తెలిపింది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top