వెండి, కంచు విగ్రహాల స్వాధీనం


మక్తల్ రూరల్ :  రెండు రోజుల్లోనే బీరప్ప ఆలయంలో విగ్రహాలను దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని సుమారు పది విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఈ కేసు వివరాలను నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మక్తల్ సీఐ కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఊట్కూర్ మండలం ఎడివె ళ్లిలోని బీరప్ప ఆలయంలో స్వామికి పూజారి నర్సింహులు ప్రత్యేక పూజలు నిర్వహించి తాళం వేసి ఇంటికి వెళ్లాడు.



శనివారం ఉదయం తిరిగి వచ్చి చూడగా తాళాలు విరగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఆరు వెండి, కంచు విగ్రహాలతోపాటు చిన్న చిన్నలింగాలు, గొడుగులు, త్రిశూలాలు నాలుగు కనిపించలేదు. దీంతో వెంటనే గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచామిచ్చారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం కాచ్‌వార్ బస్టాండు వద్ద ఓ వ్యక్తి మూట ఎత్తుకుని అనుమానాస్పదంగా బస్కెక్కి వెళ్లాడని సమాచారం అందుకున్న పోలీసులు జడ్చర్ల దగ్గర అతడిని పట్టుకున్నారు.



షాద్‌నగర్ పట్టణం ఆర్టీసీకాలనీకి చెందిన డొకూరు బాబయ్యగా గుర్తించారు. అతని నుంచి బీరప్పమూర్తి, గుర్రాలు, లింగాలు, గొడుగులు, త్రిశూలలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు *ఐదు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ నిందితుడు గతంలో మరికల్, పెద్దమందడి, కొత్తకోట, భూత్పూర్, పరిగి, గుంటూరు, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో విగ్ర హాలను దోచుకెళ్లినట్లు కేసులు నమోదయ్యాయని విచారణలో తేలింది. అనంతరం రిమాండుకు తరలించారు. ఈ సమావేశంలో మక్తల్, ఊట్కూర్ ఎస్‌ఐలు అశోక్, మధుసూదన్, ఏఎస్‌ఐ వి.చారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top