Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

వ్యాపారిపై ఇద్దరు ఎస్సైల దౌర్జన్యం

Sakshi | Updated: July 16, 2017 08:18 (IST)
వ్యాపారిపై ఇద్దరు ఎస్సైల దౌర్జన్యం వీడియోకి క్లిక్ చేయండి

ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఫుట్‌వేర్‌ వ్యాపారిపై ఇద్దరు ఎస్సైలు దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో సయ్యద్‌ ఖాద్రీ బాంబే ఫుట్‌వేర్‌ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో బస్టాండ్‌ నుంచి శనివారం రాత్రి వచ్చిన ఇద్దరు ఎస్సైలు ‘నీ మీద మాకు అనుమానం ఉంది. నిఘా పెట్టాం’అంటూ వాదనకు దిగారు. షాపు మూసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెది రించారు.

ఇంతలోనే చుట్టుపక్కల వారిని పిలుస్తుండగా.. అందులో ఒక ఎస్సై తన వద్ద ఉన్న పిస్టల్‌ తీసుకుని చంపుతానని బెదిరించి.. షాపు యజమానిపై దాడికి దిగాడు. దీంతో పరిసరాల దుకాణాల వారు అక్కడికి చేరుకుని ప్రశ్ని స్తుండగా.. వారిపై సైతం ఇద్దరు ఎస్సైలు జులుం చూపించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సైలమంటూ దుర్భాషలాడారు. చుట్టుపక్కల వ్యాపారులు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరు ఎస్సైలు బస్టాండ్‌ వైపు వెళ్లిపోయారు. వన్‌టౌన్‌ సీఐ రెహమాన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC