సీఐ కారుతో సహా రివాల్వర్ దగ్ధం..
కరీంనగర్: పట్టణ సమీపంలోని ఇరుకుల్ల బ్రిడ్జిపై ఆదిలాబాద్ డీసీఆర్బి, సీఐ దాసరి భూమయ్య కారు దగ్దమయ్యింది. కారులో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. విధులు ముగించుకుని ఆదివారం రాత్రి కరీంనగర్ వస్తుండగా షార్ట్‌సర్క్యూట్ తో కారులో మంటలు చెలరేగాయి.
వెంటనే సీఐతోపాటు డ్రైవర్, సీఐ మిత్రుడు కారు దిగి ప్రాణాలతో బయటపడ్డారు. హడావిడిలో సీఐ రివాల్వర్ కారులోనే మరిచిపోవడంతో రివాల్వర్ కాలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.