ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా

ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా


షీలాభిడేతో ఆర్టీసీ అధికారుల భేటీ

ఎటూ తేలకుండానే ముగిసిన సమావేశం

జూలైకల్లా బోర్డు భేటీ జరిపి.. తీర్మానం కాపీ అందించాలన్న షీలాభిడే

కమిటీ గడువు ఆగస్టు వరకు పెంపు?


 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం మరో మూడు నెలలు వాయిదా పడింది. ఆర్టీసీ విభజనపై ఏర్పాటు చేసిన ిషీలాభిడే కమిటీకి కేంద్రప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని పరిశ్రమల భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం హడావుడిగా ిషీలాభిడేతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, జేఎండీ రమణారావు, ఈడీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడిగా ఆర్టీసీ బోర్డు సమావేశం జరిపి తీర్మానం చేయకుండా ఆస్తుల విభజన తేలదని ిషీలాభిడే స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ ఆస్తుల పంపకం వ్యవహారంపై ఎటూ తేలకుండానే ఈ భేటీ ముగిసింది. ఆర్టీసీ బోర్డులో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేదని అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఉమ్మడి బోర్డు సమావేశం రద్దయిందని అధికారులు ిషీలాభిడేకు ఈ సందర్భంగా తెలిపారు.



బోర్డు సమావేశం వాయిదా వేసుకోవాలని కేంద్రప్రభుత్వం కూడా ఆదేశాలిచ్చిన విషయాన్ని వివరించారు. ిషీలాభిడే స్పందిస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై ఆర్డర్ కాపీ ఉందా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ అధికారులు కేంద్రప్రభుత్వ ఉత్తర్వులను అందజేశారు. దీంతో జూలై నెలాఖరు కల్లా ఆర్టీసీ బోర్డు సమావేశాన్ని నిర్వహించి, ఆస్తుల పంపకంపై తీర్మానం చేసి ఆ కాపీని అందివ్వాలని షీలాభిడే  వారిని ఆదేశించారు.  ఆస్తుల పంపకానికి మరో 3 నెలల గడువు కావాలని ఏపీ అధికారులు ిషీలాభిడేను కోరినట్లు సమాచారం. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల విభజన మరో 3 నెలలు వాయిదా పడిం ది. కాగా ఆర్టీసీ యాజమాన్యం తమ కమిటీకి అందించిన సంస్థ లెక్కల నివేదికల్లో కొన్ని మార్పులను ిషీలాభిడే  సూచిం చినట్లు తెలిసింది. తప్పులను వెంటనే సరిచేయాలని ఆదేశాలిచ్చారు. కాగా  కేంద్రం ిషీలాభిడే కమిటీ గడువును ఆగస్టు వరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top