విటులు లైంగిక దోపిడీదారులే!

విటులు లైంగిక దోపిడీదారులే! - Sakshi


వ్యభిచారానికి పాల్పడితే ఏడేళ్లు జైలుశిక్ష

విటులకు ఐపీసీ సెక్షన్ 370ఏ

వర్తిస్తుందన్న హైకోర్టు

అన్నీతెలిసి వ్యభిచార గృహాలకు వెళ్లేవారు లైంగికదోపిడీకి పాల్పడినట్లే


 

హైదరాబాద్: వ్యభిచారానికి పాల్పడి దొరికిపోయినా ఏదో జరిమానా కట్టి బయటపడతామనుకునే మగరాయుళ్లు.. ఇకపై ఐదు నుంచి ఏడేళ్ల పాటు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. అంతేకాదు భారీగా జరిమానానూ కట్టాల్సిందే. అన్నీ తెలిసి వ్యభిచార గృహాలకు వెళ్లేవారు.. అక్కడ బలవంతంగా వ్యభిచారం చేయాల్సి వస్తున్నవారిపై లైం గిక దోపిడీకి పాల్పడినట్లేనని హైకోర్టు అభిప్రాయపడింది. విటుడు ఐపీసీ సెక్షన్ 370ఏ పరిధిలోకి వస్తాడని పేర్కొంటూ సంచలన తీర్పునిచ్చింది. అన్నీ తెలిసి వ్యభిచార గృహాలకు వెళ్లి లైంగిక దోపిడీకి పాల్పడే వారిపై వ్యభిచార నిరోధక చట్టం (పీఐటీ యాక్ట్) కింద మాత్రమే కేసు నమోదు చేస్తే సరిపోదని, ఐపీసీ సెక్షన్ 370ఎ కింద కూడా కేసు నమోదు చేయాలని తేల్చి చెప్పింది. వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడిన ఒక విటుడి కేసులో న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ ఇటీవల ఈ తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఒక విటుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 370ఎ, పీఐటీ చట్టం-3, 4, 5, 6 సెక్షన్ల కింద.. విటుడిపై పీఐటీ సెక్షన్-4 కింద కేసు నమోదు చేసి సంబంధిత కోర్టులో హాజరుపరిచారు. అయితే వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనతో జీవించేవారిపై మాత్రమే పీఐటీ సెక్షన్-4 కింద కేసు నమోదు చేస్తారని.. తనకు ఆ సెక్షన్ వర్తించనందున తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆ విటుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై జరిగిన విచారణ సందర్భంగా.. విటుడిపై సెక్షన్-4 పెట్టడం చెల్లనప్పటికీ, సెక్షన్ 370ఏ కింద కేసుపెట్టవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. వీట న్నింటినీ న్యాయమూర్తి పరిశీలించి విటుడిపై సెక్షన్-4 కిం ద పోలీసులు పెట్టిన కేసును కొట్టివేశారు. మైనర్‌పైగానీ, మహిళపై గానీ లైంగిక దోపిడీకి పాల్పడుతున్నామని తెలిసి కూడా వ్యభిచారం చేస్తే ఆ వ్యక్తి సెక్షన్ 370ఏ పరిధిలోకి వస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్భయ ై ఘటన, తరువాతి పరిణామాలు, పలు చట్టాలకు చేసిన సవరణల గురించి ప్రస్తావించారు. అం దు లో భాగంగా ప్రభుత్వం ఐపీసీలో సెక్షన్ 370కి అదనంగా సెక్షన్ 370ఏ ను తీసుకువచ్చిందని తెలిపారు.

 

ఐపీసీ 370ఏ

 

 బలవంతంగా వ్యభిచారంలోకి దిగిన వ్యక్తిపై లైంగిక దోపిడీకి పాల్పడితే విధించాల్సిన శిక్షలను ఐపీసీ సెక్షన్ 370ఎ తెలుపుతుంది. దీని ప్రకారం బలవంతంగా వ్యభిచారంలోకి దిగిన వ్యక్తి మైనర్ అని తెలిసీ ఆ వ్యక్తిపై లైంగిక దోపిడీకి పాల్పడిన వారికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించవచ్చు. అదే మేజర్‌పై అయితే కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

 

పీఐటీ సెక్షన్-4


 

వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనతో జీవించే వారికి విధించే శిక్షలను వ్యభిచార నిరోధక చట్టం (పీఐటీ) సెక్షన్-4 తెలుపుతుంది. దీనిలోని సబ్ సెక్షన్-1 ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన ఏవ్యక్తయినా తనకు తెలిసి కూడా మరొకరు చేసే వ్యభిచారం ద్వారా వచ్చే సం పాదనపై పూర్తిగా లేదా కొంత భాగం ఆధారపడి జీవిస్తుంటే... ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా లేదా ఈ రెండూ విధించవచ్చు. ఒకవేళ మైనర్‌తో వ్యభి చారం చేయిస్తూ.. ఆదాయం పొందుతుంటే ఆ వ్యక్తికి కనీసం ఏడేళ్లు, గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top