బాలిక శీలానికి వెల!

బాలిక శీలానికి వెల! - Sakshi


గర్భందాల్చిన 3 నెలలకు అబార్షన్‌.. రూ.10 వేలకు ఒప్పందం



శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): ఓ బాలికను మాయమాటలతో మభ్యపెట్టిన యువకుడు ఆరు నెలలుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడునెలల గర్భవతి అయిన ఆ బాలికకు గుట్టుగా అబార్షన్‌ చేయించారు. పెద్దల సమక్షంలో ఆమె శీలానికి వెల కట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ గ్రామానికి చెందిన సన్నీ (24) ప్రైవేటు ఉద్యోగి. ఇదే గ్రామానికి చెందిన ఓ బాలిక (13) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా సన్నీ.. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటబట్టాడు. అతని మాయమాటలకు లొంగిన ఆ బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.



బాలిక ప్రవర్తనలో తేడా రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మూడు నెలల గర్భిణి తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు గ్రామపెద్దలను ఆశ్రయించగా బాలికకు అబార్షన్‌ చేయించాలంటూ రూ.10 వేలకు వెలకట్టారు. దీంతో  శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించారు. ఈ విషయంపై   డీసీపీవో దేవేందర్‌ శుక్రవారం శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top