ఏడు డీఎడ్ కాలేజీల అఫిలియేషన్ రద్దు


హైదరాబాద్: ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లను అందజేయని 7 మైనారిటీ డీఎడ్ కాలేజీల అఫిలియేషన్‌ను రద్దు చేసినట్టు పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కాలేజీలకు మార్చి 31 వరకు గడువు ఇచ్చినా వారు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లను అందజేయలేదని పేర్కొన్నారు. ఆ కాలేజీల్లో 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు చేరవద్దని సూచించారు.



ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ - జహనుమ, సనా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ - కోదాడ, లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యాప్రాల్, వీపీఈఎస్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-నల్లకుంట, గులామ్ అహ్మద్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-బంజారాహిల్స్, ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్-యాకుత్‌పురా, రవీంద్రనాథ్ ఠాగూర్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్-కుమ్మెర కాలేజీలలో చేరితే విద్యాశాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top