రాజకీయాలవైపు తొంగిచూడని వ్యక్తి శేషగిరిరావు


చిన్నపెండ్యాల(స్టేషన్‌ఘన్‌పూర్) : మొదటి నుంచి రాజకీయాల వైపు తొంగి చూడకుండా ప్రజాసేవ కోసమే తపనపడిన వ్యక్తి శేషగిరిరా వు అని విరసం నేత వరవరరావు అన్నారు. చిన్నపెండ్యాలలో స్వాతంత్య్ర సమరయోధు డు పెండ్యాల శేషగిరిరావు సంస్మరణ సభ సా హితీసుధ ఘన్‌పూర్‌స్టేషన్ అధ్యక్షుడు పార్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి బస్వరాజు సార య్య, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్క ర్ హాజరయ్యారు.



ఈ సందర్భంగా వరవరరా వు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై ఎన్నో మాట్లాడాని ఉందని, అయితే తనపై నిర్బంధాన్ని విధించడంతో  మాట్లాడలేక పోతున్నానన్నారు. తన అన్న శేషగిరిరావు మొదట టీచర్‌గా, కారోబార్, పోస్టుమన్‌గా గ్రామానికి ఎన్నో సేవలు అందించారని అన్నా రు. తమ కుటుంబం మొదటి నుంచి ప్రజాసే వ కోసమే పరితపించిందని, అందులో మొట్టమొదట ఎంపీగా ఎన్నికైన పెద్ద రాఘవరావుతోపాటు తమ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు ఆస్తులు సంపాదించుకోలేదన్నారు.



సీనియర్ జర్నలిస్టు నేరుట్ల వేణుగోపాలరావు మాట్లాడు తూ తమకున్న ఆస్తులను ప్రజలకు ఉపయోగపడేలా చేసేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రీ య విద్యాలయ లెక్చరర్ పెండ్యాల హరి మా ట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన ఇంటిస్థలాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పెండ్యాల కొండల్‌రావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో కుటుంబాలకు కుటుంబాలే పాలుపంచుకున్నాయన్నారు. అందులో పెండ్యాల రామానుజరావు కుటుంబం ఒకటని, రామానుజరావు సోదరుడు శేషగిరిరావు ఉద్యమంలో కీలక భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు.

 

‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణ



‘అలనాటి జ్ఞాపకాలు’ పుస్తకాన్ని శేషగిరిరావు భార్య సుగుణ, పెండ్యాల దామోదర్‌రావు భార్య సరస్వతి, పెండ్యాల వరవరరావు, రాంచందర్‌రావు ఆవిష్కరించారు. అనంతరం టీఎమ్మార్పీఎస్ నాయకులు వరవరరావును కలిశారు. సమావేశంలో భాష్యం వరదాచారి, రాజారపు ప్రతాప్, రాంచందర్‌రావు, ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, సర్పంచ్ సమ్మయ్య, రామస్వామి, ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌కుమార్, ఎల్‌ఐసీ బుచ్చయ్య, పేరాల రాజమౌళి, పెండ్యాల ఉపేందర్‌రావు, టి.వెంకటయ్య, ఉప సర్పంచ్ గుంపుల రవీందర్‌రెడ్డి, తాళ్లపెల్లి రాజ్‌కుమార్‌గౌడ్, రవిగౌడ్, బాబుగౌడ్, ఈఎన్.స్వామి పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top