సేవా దృక్పథం అలవర్చుకోవాలి : త్రిష గూడూరి


  • లీడ్ ఇండియా లక్ష్యాలను చేరుకోవాలి

  • మిస్ సౌత్ ఏషియా త్రిష గూడూరి

  • విద్యార్థులతో ఉత్తేజిత కార్యక్రమం

  • చొప్పదండి : విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని మిస్ సౌత్ ఏషియా త్రిష గూడూరి అన్నారు. మండలకేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం, ఝాన్సీ విద్యాలయం విద్యార్థులతో ఆమె ఉత్తేజిత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మిస్ సౌత్ ఏషియా-2014 రావడానికి చాలా కష్టపడ్డానని, ఏకాగ్రతతో ముందుకెళ్లి విజయం చేరానని వివరించారు. సామాజికిసేవలో భాగంగా దక్షిణాఫ్రికాలో పాఠశాల ఏర్పాటు చేశానని, అందులో వందమంది విద్యార్థులు చదువుకుంటుండడం ఆనందపరిచిందని పేర్కొన్నారు.



    కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బాల్యం గడిచిందని, ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం ఉంటున్నానని పేర్కొన్నారు. లీడ్ ఇండియాకు ఏడు దేశాల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నానని, బయాలజికల్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తున్నానని వివరించారు. అనంతరం స్థానిక మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు నవోదయ విద్యార్థులు నృత్యం చేసి స్వాగతం పలికారు. జెడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య మిస్ సౌత్ ఏషియాకు చొప్పదండిలో స్వాగతం పలికారు.



    తెలుగుభాషను తాను పర్యటించే దేశాల్లో అభివృద్ధి చేయాలని తెలుగు భాషా పండిత సంఘం నాయకులు శేఖర్, ఛత్రపతి శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో జేఎన్‌వి వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణయ్య, ప్రైవేటు పాఠశాలల సంఘం నిర్వాహకులు ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, జగన్‌మోహన్‌స్వామి, రత్నాకర్, విష్ణువర్ధన్‌రెడ్డి, జైసింగ్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top