వర్గీకరణపై ఇచ్చిన హామీని నెరవేర్చాలి
కరీంనగర్: ఎన్నికల సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై హామీలు గుప్పించి ఎన్నికల అనంతరం వాటి ఊసేలేదని కుల సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు కరీంనగర్ పర్యటన సందర్భంగా మంగళవారం తెలంగాణ చౌక్ వద్ద కుల సంఘాలు రాస్తారోకో చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వర్గీకరణపై చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాదిగ నేతలు డిమాండ్ చేశారు. నిరసన సభకు పోలీసులు అనుమతించకపోవడంపై వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తామని మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా తెలిపారు.