మేనత్తను వేధిస్తున్నాడనే..


 తన మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్న వ్యక్తిపై అల్లుడు కక్ష పెంచుకున్నాడు.. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు..అదును కోసం వేచి చూస్తుండగా.. ఒంటరిగా ఆరుబయట నిద్రపోతూ ఆ వ్యక్తి కనిపించాడు.. ఇంకేముంది.. ఆదమరచి నిద్రపోతున్న ఆ వ్యక్తిపై తన బంధువుతో కలిసి బండరాయితో మోది హత్య చేశాడు.. ఇదీ కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన సర్ధార్ హత్యోదంతం వెనుక ఉన్న ప్రధాన కారణం

         - కోదాడరూరల్

 

 కోదాడ మండలం గణపవరం గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన సర్ధార్ హత్య కేసు మిస్టరీ వీడింది. సర్ధార్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ సమీప బంధువే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. శనివారం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. రూర ల్ సీఐ మధుసూదన్‌రెడ్డి నిందితుల వివరాలు, హత్యకు గల కారణాలను వివరించారు. గణపవరం గ్రామానికి చెందిన ఎస్‌కె.సర్ధార్ అదే గ్రామానికి చెందిన పూలమ్మతో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వ్యక్తి గత కారణాలతో పూలమ్మ నాలుగు సంవత్సరాల నుంచి సర్ధార్‌ను దూరంగా పెట్టింది.  దీంతో సర్ధార్ 2012 ఏప్రిల్ నెలలో   పూలమ్మపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగ సర్ధార్ మూడు నెలల పాటు చర్లపల్లిలో జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చి తిరుగుతున్నాడు. అయితే పూలమ్మ మేనల్లుడు అదే గ్రామానికి చెందిన గడ్డం వెంకటేశ్వర్లు అప్పటి నుంచే సర్ధార్‌పై కక్ష పెంచుకున్నాడు.  

 

 అదును కోసం వేచి చూస్తుండగా..

 అదును కోసం వేచి చూస్తున్న వెంకటేశ్వర్లుకు అవకాశం వచ్చింది. గత నెల 25వ తేదీన రాత్రి సర్ధార్ ఒంటరిగా ఇంటి ఆరుబయట బండపై పడుకుని ఉండడాన్ని వెంకటేశ్వర్లు గమనించారు. ఇదే విషయా న్ని తన బంధువైన వట్టె వెంకటేశ్వర్లుకు తెలిపాడు. ఇద్దరూ కలిసి పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి సుమారు 50 కేజీల బరువున్న బండరాయి తీసుకువచ్చి నిద్రపోతున్న సర్ధార్ తలపై మోది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు. మొదటి నుం చి పూలమ్మ తరఫు నుంచే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా భయాందోళనకు గురై గడ్డం వెంకటేశ్వర్లు, అతడి బంధువు వట్టె వెంకటేశ్వర్లు పోలీసులకు లొంగిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు సీఐ తెలిపారు. సమావేశంలో  రూరల్ ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్, శ్రీను, వెంకన్న, శ్రీనివాస్, మనోహర్, గురుస్వామి, జానీ పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top