'తెరవెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించారు'


హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. సండ్ర తెర వెనుక ఉండి ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సండ్ర పక్కా వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఓటుకు కోట్లు కేసులో సండ్ర మొత్తం వ్యవహారాన్ని నడిపించి మే 30 నాటి ఆపరేషన్లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే.  మే 30న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి,  ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర వీరయ్య.. 8 కాల్స్‌ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సండ్రను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును సాక్షి సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల మధ్య  మే 27 నుంచి 31 మధ్య 32 సార్లు ఫోన్ సంభాషణలు సాగాయి. సండ్ర మాట్లాడిన సంభాషణలు..

 


  • ఎమ్మెల్యేలు ఎవరెవరు డబ్బులకు లొంగుతారో సండ్ర ఆరా

  • ఎంత డబ్బు పెడితే ఏ ఎమ్మెల్యే వస్తారు

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేల గైర్హాజరు, మరికొందరు టీడీపీకి ఓటు వేసేలా వ్యూహం

  • మైనార్టీ ఎమ్మెల్యేల లక్ష్యంగా బేరసారాలకు వ్యూహం

  • మహానాడు సభా వేదికల్లోనూ కుట్ర సంభాషణలు

  • బాస్ తరపున వ్యవహారం నడిపించాలంటూ సెబాస్టియన్ కు సండ్ర సూచన

  • ఎమ్మెల్యేల కొనుగోలుకు బాస్తో మాట్లాడి డబ్బులు అరెంజ్ చేస్తా

  • డబ్బులకు లొంగకుంటే అధికారం ఆశ చూపాలి

  • ఏపీలో చంద్రబాబు సర్కార్ ఉంది

  • ఏపీలో ఆంగ్లో ఇండియన్ పోస్టులు ఖాళీ

  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ పేరు చంద్రబాబుకు చెబుతా

  • ఏపీలో ఏ పని కావాలన్నా బాబుతో చెప్పి చేయిస్తా

  • ఎవరైనా చుట్టాలుంటే చెప్పు.. బాబుకు చెప్పి పని చేయిస్తా

  • హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు మాదే అధికారం
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top