పట్టుబడిన గంధం చె ట్లు నరికే ముఠా సభ్యులు


పెద్దేముల్/ధారూరు: వ్యవసాయ పొలాల్లో పెంచిన గంధం చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుని తిరుగుతున్న ముఠా సభ్యులు ఇద్దరు శుక్రవారం మండలంలోని మంబాపూర్ గ్రామస్తులకు అడ్డంగా దొరికి పో యారు. వివరాలిలా.. మెదక్ జిల్లా జహీరాబాద్ సమీప మల్‌చల్మతండాకు చెందిన దశరథ్, సంతోష్‌లు గ్రామాలు తిరుగుతూ గంధం చెట్ల నాణ్యత గుర్తించి వాటిని మొదట ఖరీదుకు అడుగుతారు. రైతులు అంగీకరించకపోవడంతో రాత్రికి రాత్రే వాటిని నరికి తరలిస్తుంటారు. అందులో భాగంగానే శుక్రవారం పై ఇరువురూ గ్రామంలోని జీ బాల ప్ప, దస్తప్ప పొలాల వద్దకు వచ్చి గంధం చెట్ల గురించి ఆరా తీశారు. అయితే రైతులకు అనుమానం వచ్చి గంధం చెట్లు లేవని సమాధానం చెప్పడంతో పై ముఠా సభ్యులు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు నటించారు.

 

  రైతులు అక్కడి నుంచి వెళ్లిపోగానే తాము వెంట తెచ్చుకున్న డ్రిల్ మిషన్‌తో రంధ్రం చేసి చెట్టు నాణ ్యతను గుర్తించే పనిలో పడ్డారు. అయితే మిషన్ శబ్దానికి రైతులు అక్కడి చేరుకుని వారి ని పట్టుకుని వీఆర్‌ఓ రాజేశ్వర్‌రావుకు అప్పగించారు. ఆయన ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఓంప్రకాశ్‌ను సంఘటనా స్థలానికి పిలిపించి నిందితులను అప్పగించారు. అయితే నిందితులిద్దరినీ పెద్దేముల్ పోలీసులకు అప్పగించిన ట్లు ధారూరు డిప్యూటీ ఫారెస్టు ఆఫీసర్ యూసూఫ్‌పాషా తెలిపారు. ఇది లా ఉండగా.. ఈ ముఠా సభ్యులు ఆరు నెలలుగా చుట్టుపక్కల గ్రామా ల్లో గంధం చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్నట్లు రైతులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top