4 ఆస్పత్రులు.. 6 గంటలు..

4 ఆస్పత్రులు.. 6 గంటలు.. - Sakshi

- కాన్పు కోసం వచ్చి.. వైద్యం అందక నరకయాతన

- నాలుగు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా అదే నిర్లక్ష్యం

 

సాక్షి, వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి కార్యక్రమం మొదటి రోజే ఓ గర్భిణి నరకయాతన అనుభవించింది. వైద్యులు అందుబాటులో ఉండకపోవడం.. ఉన్న చోట పట్టించుకోక ఇంకో ఆస్పత్రికి రిఫర్‌ చేయడం.. ఇలా ఆమెను 4 ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. 6 గంటలపాటు పురిటినొప్పులతో ఆమె పడిన బాధలు వర్ణనాతీతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేం ద్రానికి చెందిన కొమ్ము లక్ష్మి గర్భిణి. అంతకుముందే వైద్యపరీక్షలు చేయించుకున్న ఆమెకు కడుపులో కవలలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో లక్ష్మి రెండో కాన్పు కోసం భర్త, బంధువులతో కలసి శనివారం పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది.



పరీక్షించిన వైద్యులు.. లక్ష్మికి అత్యవసర వైద్యం అవసరమని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసు కెళ్లాలని సలహా ఇచ్చారు. అక్కడ  ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ సాయంత్రం 4 గంటల వరకు వస్తారని, వెంటనే ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు. అయితే, ఉదయం 10 గంటల నుంచి పురుటి నొప్పులతో లక్ష్మి బాధపడుతోంది. 4 గంటలు గడిచినా సూపరింటెం డెంట్‌ రాకపోవడం.. మిగతా వైద్యులు కూడా ఎవరూ చికిత్స అందించకపోవడంతో లక్ష్మి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అధికంగా రక్తస్రా వం అవుతుండ టంతో వనపర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి ఉండడంతో  ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు.

 

అంబులెన్స్‌ రాదని చెప్పిన సిబ్బంది. 

పరిస్థితి విషమంగా ఉండటంతో గర్భిణిని మొదట ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించే సమయంలో కానీ ఆ తరువాత కర్నూలుకు తరలించే సమయంలో అం బులెన్స్‌ వాహనం కావాలని జిల్లా ఆస్పత్రి సిబ్బం దిని అడిగితే ఎక్కడపడితే అక్కడ రాదని.. అవస రమైతే ప్రైవేట్‌ వాహనాన్ని మాట్లాడుకోండని చెప్పినట్లు లక్ష్మి భర్త విజయ్‌ వాపోయాడు. అనంతరం ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ వాహనాన్ని రూ.3,500 మాట్లాడుకుని కర్నూలుకు తరలించారు.

 

వైద్యులతో మాట్లాడిన..

గర్భిణి లక్ష్మి కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు కాబట్టే పెబ్బేరులోని వైద్యులు ఆమెను వనపర్తి జిల్లా ఆస్పత్రికి పంపించారు. మేము ఇక్కడ ఆమెకు ఉదయం నుంచే చికిత్స అందించాం. నేను ఆస్పత్రిలో లేకపోయినా అక్కడి వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నా. కడుపులో కవలలు ఉన్నారు కాబట్టి ప్రసవం అయ్యాక పిల్లలను వెంటనే ఎన్‌ఐసీయూలో ఉంచాలి. అందువల్ల మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాం. 

– భాస్కర్‌ ప్రభాత్, వనపర్తి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top