సాక్షి.. ఇండియా స్పెల్‌బీకి విశేష స్పందన


  • రెండు కేటగిరీల్లో పరీక్ష నిర్వహణ

  • హాజరైన వివిధ పాఠశాలల విద్యార్థులు

  • వరంగల్ చౌరస్తా : విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు సాక్షి, ఇండియా స్పెల్ బీ సంయుక్తంగా బుధవారం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. వరంగల్ ఎల్లంబజార్‌లోని రిషి హైస్కూల్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తొలుత 1, 2 కేటగిరీలకు, రెండో విడతలో 3, 4 కేటగిరీలుగా విభజించి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ సాక్షి దినపత్రిక ప్రకటనల విభాగం జిల్లా మేనేజర్ ఓంప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయుడు వేణుగోపాల్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కాగా, ఇక్కడి పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు రీజినల్ స్థాయికి అర్హత సాధిస్తారని నిర్వహకులు తెలిపారు.

     

    వొకాబులరీ పెరుగుతుంది

    స్పెల్ బీ పరీక్షకు హాజరుకావడం  వల్ల వొకాబులరీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆంగ్ల పదాల ఉచ్ఛారణ తెలుస్తోంది. కమ్యూని కేషన్ స్కిల్స్ పెరుగుతాయనే నమ్మకం ఉంది. పరీక్షకు హాజరుకావడం సంతోషాన్ని కలిగిస్తోంది.

     - శ్రీలేఖ, 9వ తరగతి, రిషి హైస్కూల్

     

    పదాల్లోని తప్పులను తెలుసుకోవచ్చు

    ఈ పరీక్షలకు హాజరుకావడం వల్ల ఇంగ్లిస్ పదాల్లో దొర్లిన తప్పుల ను గుర్తించవచ్చు. వీటిపై కొద్దిగా కసరత్తు చేస్తే భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కొత్త పదాలను తెలుసుకున్నాను. ఈ పరీక్ష మిగతా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పనికొస్తుంది.

     - భువనశ్రీ, 4వ తరగతి, గోల్డెన్ త్రిషోల్డ్ స్కూల్

     

    బృహత్తర కార్యక్రమం

    విద్యార్థుల్లో మేథాశక్తి పెంపొందించడానికి సాక్షి బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఈ పరీ క్ష ద్వారా విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు పెరుగుతోం ది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తోంది.

     - వేణుగోపాల్, పాఠశాల ఉపాధ్యాయుడు

     

    పోటీ పరీక్షల్లో అర్హత సాధిస్తా..

    సాక్షి నిర్వహిస్తున్న స్పెల్ బీ పోటీ పరీక్షల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తాననే నమ్మకం కలిగింది. అలాగే, ఇంగ్లిష్ పట్ల మరింత అవగాహన కలుగుతోంది. ఎన్నో కొత్త పదాలు తెలుసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

     - ప్రణీలాష్, 4వ తరగతి, ప్లాటినం జూబ్లీ హైస్కూల్

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top