సాగర్ రెండోజోన్‌కు సాగునీరు విడుదల


కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని  సాగర్ రెండో జోన్‌కు శనివారం నీటిని విడుదల చేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే  రాంరెడ్డి వెంకటరెడ్డి నీటిని కాల్వలకు వదిలారు. అంతకు ముందు వారు కృష్ణమ్మకు పూజలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ  జిల్లాలో సాగర్ మొదటి జోన్‌కే ప్రభుత్వం తొలుత నీటిని విడుదల చేసిందని, రెండో జోన్ పరిధిలోని  రైతుల సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకుని రెండోజోన్‌కు కూడా నీటిని వదలాలని రాష్ర్ట భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావును కోరగా ఆయన అంగీకరించారని తెలిపారు.



ఇందుకు కలక్టర్ చేత ప్రతిపాదన కూడా పంపించిన ట్లు తెలిపారు. ఈక్రమంలో సాగర్‌డ్యామ్‌కు ఎగువ నుంచి నీరు రావడంకూడా కలసిరావడంతో   రెండోజోన్‌కు ప్రభుత్వం నీటిని త్వరిత గతిన విడుదల చేసిందన్నారు. ప్రతి రైతుకు నీరు ముఖ్యమని, పొదుపుగా వాడుకోవాలని సూచిం చారు. కాల్వ పరిధిలోని  మొదటి రైతులు సహకరించి చివరి రైతులకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలోని ఆయకట్టులో  ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.



ఆంధ్రలో మూడో జోన్‌లో జిల్లాకు చెందిన 17 వేల ఎకరాల ఆయకట్టు ఉందని , దాన్ని రెండో జోన్‌లో చేర్చాలని నీటి పారుదల శాఖ మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నీరు ఎంతో విలువైందని, దానిని ప్రతి రైతు పొదుపుగా వాడుకునేలా అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు.   



రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలని, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పాలేరు ఇన్‌చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ  సభ్యులు వడ్త్యి రాంచంద్రునాయక్,  ఎన్నెస్పీ ఎస్‌ఈ అప్పలనాయుడు, ఈఈలు సుమతీదేవి, కృష్ణకుమార్, డీఈఈలు అక్బర్‌పాషా, యాదగిరిరెడ్డి, జేఈఈలు రంజిత్ కుమార్, శ్రీనివాస్, ట్రాన్స్‌కో, జెన్‌కో డీఈఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పాలేరు, నాయకన్‌గూడెం సర్పంచ్‌లు మాదవీరెడ్డి, దేవర అమల,  మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, ఎంపీటీసీ సభ్యులు బారి శ్రీనివాస్, అలింగ గోవిందరెడ్డి, కోఆఫ్షన్ అహ్మద్‌అలీ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరె డ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి,  మంగిరెడ్డి, బయ్య లింగ య్య, వైవీడీరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మట్టె గురవయ్య, బిక్షంనాయక్, బాలకృష్ఫారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తయ్య, టీఆర్‌ఎస్ నాయకులు షేక్ రంజాన్ పాలొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top