‘ప్రణాళిక’ కోసం రూ.32.47 కోట్లు


హన్మకొండ అర్బన్ : మన ఊరు-మన  ప్రణాళిక అమలు కోసం రూ.32.47 కోట్లనిధులు మంజూరయ్యూయని కలెక్టర్ కిషన్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ప్రణాళికల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా ఆధారంగా నిధులు మంజూరయ్యూయని పేర్కొన్నారు.

 

మంజూరైన నిధుల్లో 50 శాతం పంచాయతీలు, 30 శాతం మండల పరిషత్‌లు, 20 శాతం జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా.. ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాగునీరు, కిచెన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్పొరేషన్‌లో విలీనమైన 42 గ్రామాల్లో లింకు రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, తండాల్లో విద్యుత్ సౌకర్యం, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

26న పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్


ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఈనెల 26న ప్యాకేజీ టూర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్‌లో భాగంగా రామప్ప, లక్నవరం, ఖిలావరంగల్‌లో సౌండ్‌అండ్ లైట్స్ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 25వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటలోపు 9392445721, 9849338854, 9866919131 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రత్యేక సదస్సు, 25 నుంచి 27 వరకు పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్‌హాల్‌లో పర్యాటక ప్రాంతాల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ కిషన్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top