‘రూ.23లక్షలపై’ కొనసాగుతున్న విచారణ


మరో ఐదుగురిని విచారించిన సీసీఎస్ పోలీసులు



 రామగుండం :

 రామగుండం మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహంలో జరిగిన రూ.23 లక్షల నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై బుధవారం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్‌స్టేషన్) సీఐ మాధవి, ఎస్సై ఉపేందర్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. ఐదుగురు పార్ట్‌టైం ఉపాధ్యాయుల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. నిధుల దుర్వినియోగంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయమై వసతి గృహాల రాష్ట్ర కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్.



ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నట్లు మాధవి పేర్కొన్నారు. మొదటి దశ ఈనెల 17న 30 మంది సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన.. పోలీసులు తాజాగా 2009 నుంచి గురుకులంలో తాత్కాలిక ఉద్యోగులను ఏ ప్రాతిపదికన.. ఏ అవసరం నిమిత్తం నియమించారు..? అప్పటివరకు శాశ్వత ఉద్యోగుల విధులు.. బాధ్యతలతోపాటు రిక్రూట్‌మెంట్ చేసుకున్న అధికారులు నిర్వర్తించిన విధులపై ఆరా తీశారు. ఐదేళ్లలో గురుకులంతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరిని (సుమారు 90 మంది) నుంచి వివరాలు సేకరించి.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మాధవి వివరించారు.



 ఆడిట్ బృందంలో వెలుగు చూసిన అక్రమాలు

 గురుకులంలో 2009 నుంచి అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జూలై 7 నుంచి మూడురోజులపాటు ఆడిట్ బృందం సహాయక కార్యదర్శి ఏ.మాధవచార్యా ఐదుగురు సభ్యులతో కలిసి గురుకులం నిర్వహణ ఖర్చులు, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ చేపట్టారు. 24 అంశాల్లో రూ.23లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అప్పటికే ప్రిన్సిపాల్ సరోజన 15మే 2013న చింతకుంటకు బదిలీ చేశారు. అనంతరం 19జూన్ 2014న సరోజనను, ఈనెల ఒకటిన మురళిని ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.



 ప్రిన్సిపాల్, సినియర్ అసిస్టెంట్

 చేసిన అక్రమాల్లో కొన్ని..


     పార్ట్‌టైం ఉపాధ్యాయుల నియామకంలో సుమారు రూ.2.78 లక్షలు

     పాల కాంట్రాక్టు ద్వారా రూ.ఐదు లక్షలు

     విద్యుత్ బిల్లుల్లో రూ.2.15 లక్షలు

     తాగునీటికి బిల్లుల రూపంలో రూ.1.12 లక్షలు

     నిత్యావసర వస్తువుల కొనుగోలులో రూ.4 లక్షలు

     {పత్యేక డైట్ వస్తువుల కొనుగోలు (మటన్, బ్రెడ్ ఇతరత్రా) రూ.1.67 లక్షలు

     బియ్యం రవాణా ఖర్చులు రూ.1.55 లక్షలు

     ఫ్యాన్లు, యంత్రాలమరమ్మతుకు రూ.1.27 లక్షలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top