వెంకన్న బాకీ రూ.214 కోట్లు

వెంకన్న బాకీ రూ.214 కోట్లు


తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు: హరీశ్

 సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రావాల్సిన కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)ను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం టీటీడీ నుంచి తెలంగాణకు  (రాష్ట్ర విభజన జరిగిన నాటి వరకు) రూ.241 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిధులు తెచ్చేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. 2003 నుంచి 2013 వరకు దేవాదాయ శాఖకు టీటీడీ మొత్తం రూ. 576.53 కోట్లు బకాయి ఉందన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ తన నివేది కలో ఈ విషయాన్ని ప్రస్తావించిందని చదివి వినిపించారు.

 

 విభజన జరిగిన తేదీ వరకు.. జనాభా ప్రాతిపదికన ఈ నిధులను దేవాదాయశాఖ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వీటికి తోడు 2013-14 బకాయిలు కూడా అదనంగా రావాల్సి ఉంటుందన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు విఠల్‌రెడ్డి, ఆరూరి రమేశ్,  లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం 33 కామన్ గుడ్ ఫండ్ ప్రతి పాదనలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ నిధిలో రూ. 26.63 కోట్లు అందుబాటులో ఉన్నాయని, కానీ.. పురోగతిలో ఉన్న పనులకు మరో రూ. 31.25 కోట్లు అవసరమవుతాయని.. మరో రూ. 5.41 కోట్లు ధూప దీప నైవేద్యాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ సీజీఎఫ్‌లో లోటుగా పరిగణించాల్సి ఉందన్నారు.

 

 అర్చకులకు అయిదు నెలలుగా వేతనాలు చెల్లించటం లేదని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అర్చక సంక్షేమ నిధి ఉన్నప్పటికీ ఆదాయం లేదని.. దేవాలయాల అభివృద్ధికి సీజీఎఫ్ నిధులు సరిపోయే పరిస్థితి లేదని.. ప్రత్యేకంగా ప్రభుత్వం కన్సాలిడేట్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. టీటీడీ నుంచి రావాల్సిన బకాయిలు రాబట్టుకునేందుకు శాసనసభలో అన్ని పార్టీల సహకారంతో ఏకగ్రీవంగా తీర్మా నం చేయాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రతి పాదించారు. స్పందించిన హరీష్‌రావు దేవాల యాల అభివద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని.. అవసరమైతే రెగ్యులర్ బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. ఇటీవల యాదగిరిగుట్టకు రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అర్చకులకు పెండింగ్‌లో ఉన్న అయిదు నెలల జీతాలు, ధూపదీప నైవేద్యాలకిచ్చే నిధులను ఇటీవలే జిల్లాలకు విడుదల చేసిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top