ప్రజల గుండెల్లో వైఎస్

సోమవారం రంగారెడ్డి జిల్లా మంఖాల్ లో ఎంగల జోసెఫ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న షర్మిల. చిత్రంలో ఎడ్మ కిష్టారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, సురేశ్ ర - Sakshi


పరామర్శ యాత్రలో షర్మిల

* అభిమాన నేత మరణించి ఆరేళ్లయినా అదే ఆత్మీయత

* జనం బాధను తన బాధగా భావించినందునే వారి హృదయాల్లో నిలిచిపోయారు

* రైతే రాజని, వ్యవసాయం పండుగ అని చేతల్లో చూపారు

* తొలిరోజు రంగారెడ్డి జిల్లాల్లో మూడు కుటుంబాలకు పరామర్శ


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జనం బాధను తన బాధగా భావించినందునే ప్రజల గుండెల్లో వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.



నాన్న మరణించి ఆరేళ్లయినా.. అదే ఆప్యాయత కనబరుస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులే అందుకు కారణం’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన ఆమె.. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన మూడు కుటుంబాలను పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల.. నేరుగా హైదరాబాద్ శివారుల్లోని మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకున్నారు.



ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా అభిమానులు నీరాజనాలు పలికారు. చౌరస్తాలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన షర్మిల.. అక్కడ్నుంచి నేరుగా జిల్లెల గూడా గ్రామానికి చేరుకొని వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన బి.అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరగంటపాటు వారితో గడిపిన షర్మిల.. అందరినీ పేరుపేరునా పలకరించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అక్కడ్నుంచి పరామర్శ యాత్ర రంగారెడ్డి జిల్లా మంఖాల్‌కు చేరుకుంది. ఈ గ్రామంలోని ఎంగల జోసఫ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

 

రైతుల హృదయాల్లో చెరగని ముద్ర

దండుమైలారంలో వైఎస్సార్ తనయ షర్మిలకు ఘన స్వాగతం దక్కింది. ఊరంతా కలసిరాగా..డప్పువాయిద్యాల మధ్య ఆమె ప్రజలతో కలసిసాగారు. ఈ గ్రామంలో వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన పోకల్‌కార్ మహేశ్వర్‌జీ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. తర్వాత ఇక్కడ  జరిగిన సమావేశంలో ప్రసంగించారు.

 

‘రైతేరాజనీ.. వ్యవసాయం పండగని చేతల్లో చూపిన మహానేత రాజన్న. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధరలు కల్పించడంతో రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లక్షలు ఖర్చయ్యే విద్యను పేద విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు ఫీజుల పథకం ప్రవేశపెట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఎంతోమందికి పునర్జన్మనిచ్చింది. 108 సేవలు వైఎస్ గుండె చప్పుడు’ అని షర్మిల అన్నారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 46 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే.. ఒక్క రాష్ర్టంలోనే వైఎస్ 46 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు.

 

వాగ్దానాలు నెరవేర్చిన మహానేత..

ప్రజలకిచ్చిన వాగ్దానాలను తూ.చ తప్పకుండా నెరవేర్చిన మహా నాయకుడు వైఎస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దళితులు, మైనార్టీల సంక్షేమం వైఎస్ పాలనలోనే సాగిందని, అందుకే ఇప్పటికీ వైఎస్ కుటుంబంపై వారు అభిమానం చూపుతున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ ఎంతో మంది రైతు కుటుంబాల్లో సంతోషం నింపింద న్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రుక్మారెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఏనుగు మహిపాల్‌రెడ్డి, అమృతాసాగర్, గోపాల్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, కుసుమకుమార్‌రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు జార్జి హెబట్, వెల్లాల రాంమోహన్, ఐటీ విభాగం అధ్యక్షుడు సందీప్ కుమార్, మెరుగు శ్రీనివాస్‌రెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బి.రఘురాంరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, ఎం.భగవంత్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బంగి లక్ష్మణ్, షర్మిలా సంపత్, రమా ఓబుల్‌రెడ్డి, ఇరుగు సునీల్ కుమార్, ఎండీ సలీం, డోరెపల్లి శ్వేత, ప్రచార కమిటీ విభాగం కార్యదర్శి డి.అమరనాథ్‌రెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, ఆర్.సంతోష్‌రెడ్డి, ఆర్. సతీష్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్, మామిడి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

 

బాబు బాధ్యత నాదే..

మంఖాల్ గ్రామంలో పోలియోతో బాధపడుతున్న ఎంగల జోసఫ్ మనవడు సృజన్‌ను చూసి షర్మిల చలించిపోయారు. కాళ్లు, చేతి కీళ్లలో చలనం తగ్గడంతో బాలుడు పడుతున్న ఇబ్బందిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. భోజనం చేసేందుకు కూడా చేతులు సకహరించవని, చికిత్స చేయిస్తే ఫలితం ఉంటుందని కుటుంబ సభ్యులు వివరించారు. కానీ ఇందుకు భారీగా ఖర్చవుతుందని, ఆర్థిక స్తోమత లేనందునే చికిత్స చేయించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో షర్మిల.. సృజన్ చికిత్స బాధ్యత తనదేనని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top