పాఠశాలల బస్సులపై కొరడా


మహబూబ్‌న గర్ క్రైం : జిల్లావ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మృత్యవాతపడిన విషయం విదితమే. దీంతో అప్రమత్తమైన ఇక్కడి ఆర్టీఏ అధికారులు విద్యా సంస్థలకు చెందిన బస్సుల తనిఖీని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం ఒక్కరోజే 11 బస్సులను సీజ్ చేశారు. రెండు రోజుల్లో 19 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీఏ ఎల్.కిష్టయ్య, ఎంవీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో వారు మాట్లాడుతూ జిల్లాలోని విద్యాసంస్థలకు చెందిన అన్ని బస్సులను పరిశీలిస్తున్నామన్నారు. డ్రైవర్ లెసైన్స్, ఆర్ సీ బు క్కు, వయసు, విద్యార్థుల వివరాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబరు ప్రతి బస్సు లో ఉండాలని పాఠశాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించవద్దని సూచించారు. కండిషన్‌లో ఉన్న వా హనాన్నే విద్యార్థులు ప్రయాణానికి ఉపయోగించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోపై డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై తీసుకుంటామనిహెచ్చరించారు. కాగా, ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే ఆర్టీఏ అధికారులు నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించి హడావుడి చేయడం తప్పా ఆ తర్వాత పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

 నేడు డ్రైవర్లకు శిక్షణ

 పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లకు ఆదివారం బండమీదిపల్లిలోని డ్రైవిం గ్ ట్రాక్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంవీ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బస్సుల వేగంపై క్షుణ్ణంగా వారికి వివరిస్తామన్నారు. వేగం వల్ల జరిగే అనర్థాలను వీడియో ద్వారా వారికి అవగాహన కల్పిస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే జరిగే నష్టాలు, ప్రమాదాలు చోటు చేసుకుని క్షతగ్రాతులుగా మిగిలితే బాధితుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియజేస్తామన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top