ఇసుక డంపుల సీజ్‌

ఇసుక డంపుల సీజ్‌ - Sakshi


► తరలింపును అడ్డుకున్న అధికారులు

► 200ట్రాక్టర్ల ఇసుక డంపుల స్వాధీనం

► ఏడు ఇసుక ట్రాక్టర్లు,    ఇటాచీ స్వాధీనం

► కేసు నమోదుచేసిన  పోలీసులు




బిజినేపల్లి (నాగర్‌కర్నూల్‌):

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో బీమసముద్రం చెరువు నుంచి అక్రమంగా చేపట్టిన ఇసుక తరలింపును రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం దాడిచేసి అడ్డుకున్నారు. గ్రామ సమీపంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలోని పౌల్ట్రీఫామ్స్‌ వద్ద పెద్ద మొత్తంలో గుట్టుచప్పుడు కాకుండా ఇసుక డంపులను చేస్తున్న సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.



ప్రత్యక్షంగా దాడులు నిర్వహించి ఇటాచీతో పాటు ఏడు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గ్రామానికి మంజూరైన సీసీరోడ్ల నిర్మాణం కోసం ఇసుకను అనుమతులు లేకుండా పొట్టల బాబుసాగర్‌ తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డంపు చేసిన 200ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేస్తున్నట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు.



ట్రాక్టర్లు, ఇటాచి సీజ్‌

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల యజమాను లు కాశమోని రవి వాహనం ఏపీ 22ఎక్స్‌ 2151, అస్కని పెద్ద పాండు.. టీఎస్‌ 06 ఈఎఫ్‌ 7537, కసరి చెన్నయ్య.. ఏపీ 22డబ్ల్యూ 1789, పొట్టల అమీర్‌బాబు.. ఏపీ 22 ఏఈ 4857, సంగిశెట్టి వెంకటయ్య ఏపీ 22 ఏడీ 2254, టి.చంద్రశేఖర్‌రెడ్డి.. ఏపీ 36 ఏజెడ్‌ 3943, ద్యావరి బాలయ్య.. టీఎస్‌ 06 ఈఎఫ్‌ 8151లతో పాటు పొట్టల బాబుసాగర్‌కు చెందిన ఇటాచీని సీజ్‌చేసి యజమానులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.



రెవెన్యూ అధికారులకు మెమోలు

బీమ సముద్రం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీఆర్వో వహీద్‌తో పాటు వీఆర్‌ఏలు నాగిరెడ్డి, నర్సింహ, యాదయ్యకు మోమోలు జారీ చేస్తున్నట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top