ఎస్సీ శాఖలో రెవెన్యూ అధికారులు


సాక్షి, హైదరాబాద్‌: ఐదుగురు డిప్యూటీ కలె క్టర్లను ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులుగా నియమించడం వివాదానికి దారి తీసింది. వారి నియామకంపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శాఖాపరంగా పదోన్నతులిచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలు కూడా తీసుకోకుండా నియామకా లు చేపట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.



పాత 10 జిల్లాల్లో ఉప సంచాలకులు(డీడీ) జిల్లా ఎస్సీ అధికారులు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి సహా యకులుగా జిల్లాకొకరు చొప్పున (హైదరా బాద్‌లో ఇద్దరు) 11 మంది జిల్లా సాంఘిక సంక్షేమాధికారులు(డీఎస్‌డబ్ల్యూవో) పనిచే స్తున్నారు. తాజాగా జిల్లాల సంఖ్య 31కి చేరడంతో పాత జిల్లాల్లోని డీడీలను అలాగే కొనసాగిస్తూ 11 మంది డీఎస్‌డబ్ల్యూవోలను కొత్త జిల్లాలకు ఎస్‌డీడీవో(ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి)గా నియమించింది. ఇలా 21 జిల్లాలకు అధికారులను సర్దుబాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మిగతా పది జిల్లాలో ఏఎస్‌డబ్ల్యూవో (సహాయ సాంఘిక సంక్షే మాధికారి)ని ఇన్‌చార్జ్‌లుగా నియమించింది.



 తాజాగా రెవెన్యూ శాఖకు చెందిన ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లను నల్లగొండ, పెద్దపల్లి, వనపర్తి, సూర్యాపేట, జనగామ జిల్లాలకు ఎస్‌డీడీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చిం ది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖలోనూ మరో డిప్యూటీ కలెక్టర్‌ను జిల్లా సంక్షేమాధి కారిగా నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్లు, ఏఎస్‌డబ్ల్యూవోల పదో న్నతులకు సంబంధించిన ఫైలు వద్ద పెండిం గ్‌లో ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్లను నియమించడంపై తెలంగాణ ఏఎస్‌డబ్ల్యూ వో, సంక్షేమ శాఖ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.



ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీసీ సంక్షే మశాఖ మంత్రి జోగు రామన్నలకు విజ్ఞాపన లిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే ఒక ట్రెండు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలంగాణ సహాయ సాంఘిక సంక్షేమాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top