టీడీపీని దెబ్బతీసేందుకు కేసీఆర్‌ కుట్ర: రేవంత్‌

టీడీపీని దెబ్బతీసేందుకు కేసీఆర్‌ కుట్ర: రేవంత్‌ - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: టీడీపీని దెబ్బ తీసేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్ర చేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల పార్టీ అయి న టీడీపీని ఎవరూ ఏం చేయలేరన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావ దినం, ఉగాది పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తాము ముందుకు సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖరరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కొందరు వీడినా నష్టం లేదు: రమణ

టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆ పార్టీపైనే కక్ష కట్టారని టీటీడీపీ అధ్య క్షుడు ఎల్‌.రమణ ధ్వజమెత్తారు. కొందరు నాయకులు  పార్టీ మారి వెళ్లినంత మాత్రా న పార్టీకి నష్టమేమీ లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top