ఇంధన పొదుపులో రీజియన్ ముందంజ


హన్మకొండ : ఇంధన పొదుపులో ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఇతర రీజియన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి అధికారుల కృషితో వరంగల్ రీజియన్ ఇంధన ఆదాలో రికార్డులు సాధిస్తోంది. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించేం దుకు ఖర్చులు తగ్గించడంలో భాగంగా రీజి యన్ అధికారులు ఇంధన పొదుపు, టైర్ల మ న్నిక, టైర్ల జీవితకాలం పెంపుపై దృష్టి సారిం చారు. ఈ మేరకు డీజిల్ పొదుపుపై డ్రైవర్లకు నిరంతర శిక్షణ  ఇస్తూ ఎలా బస్సు నడిపితే డీజి ల్ ఆదా అవుతుందో వివరిస్తున్నారు.



ఈ శిక్షణ ఫలితంగా 2011-2012 ఆర్థిక సంవత్సరంలో 5.49 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలోనే ప్రథమ స్థా నం, 2012-2013 ఆర్థిక సంవత్సరంలో 4.9 కేఎంపీఎల్‌తో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, 2013-2014లో 5.50 కేఎంపీఎల్‌తో ద్వితీయ స్థానంలో నిలిచిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 5.55 కేఎంపీఎల్ సాధించి అగ్రస్థానంలో దూసుకువెళ్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే 5.55 కేఎంపీఎల్‌తో ప్రథమ స్థానంతో ముందు నిలుస్తోందని అధికారులు వెల్లడించారు.



కాగా, ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల్లో గరుడ బస్సులు డీజిల్ అతి ఎక్కువగా తీసుకుంటుండగా.. ఇందులో కూ డా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 4.24 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజి యన్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 763 బస్సులు ప్రతి రోజుకు మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. అధికారుల సూచనలు, ప్రోత్సాహంతో కార్మికులు ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చులు తగ్గిస్తూ ఆదా చేస్తున్నారు.

 

సమష్టి కృషితోనే ఈ విజయం...

సమష్టి కృషితో ఇంధన పొదుపులో సంస్థలోనే ప్రథమ స్థానంలో నిలవగలుగుతున్నాం. రీజినల్ మేనేజర్ ఇ.యాదగిరి సూచనలు.. డ్రైవర్లు, మెకానిక్‌ల సహకారంతో నిరంతర శిక్షణ ద్వారా ఇంధన పొదుపును చేయగలుగుతున్నాం. అలాగే, పొదుపులో ముందు నిలుస్తున్న డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తున్నాం. డీజిల్ పొదుపు ద్వారా ఖర్చులు త గ్గిస్తూ సంస్థకు పరోక్షంగా ఆదాయాన్ని సమకూర్చుతున్నాం.

 - అంచూరి శ్రీధర్, డిప్యూటీ సీఎంఈ, వరంగల్ రీజియన్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top