మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం

మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం - Sakshi


► జడ్జి, తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన వైద్య నిపుణులు

► ఒంటిపై గాయాలు లేవు, ఎముకలు విరగలేదు: ఫోరెన్సిక్‌ నిపుణులు




సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మం డలం ఖానాపూర్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన దళిత యువకుడు మంథని మధుకర్‌ మృతదేహానికి సోమవారం రీపోస్టు మార్టం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ఖననం చేసిన చోటే పోలీస్‌ బందోబస్తు మధ్య రీపోస్టుమార్టం జరిపించారు.


కరీంనగర్‌ జిల్లా ఫస్ట్‌క్లాస్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ కుష, మంథని తహసీల్దార్‌ జి.శ్రీనివాస్, మధుకర్‌ కేసు విచారణాధికారి, పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మ, మధుకర్‌ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్య సమక్షంలో కాకతీయ, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు కృపాల్‌సింగ్, దేవరాజ్‌ రీపోస్టుమార్టం చేశా రు. మధుకర్‌ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బంధువులు మారుపాక సమ్మయ్య, నక్క ఎల్లయ్యను కూడా రీపోస్టుమార్టం వద్దకు అనుమతించారు. వీడియో చిత్రీకరణ మధ్య వైద్య నిపుణులు 2 గంటలకుపైగా రీపోస్టు మార్టం నిర్వహించారు. ప్రక్రియ జరుగుతు న్నంతసేపు సమీపంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



హైకోర్టుకు నివేదిక...

రీపోస్టుమార్టం నివేదికను సీల్డ్‌ కవర్‌లో వారం రోజుల్లో హైకోర్టుకు పంపనున్నట్లు వైద్యులు తెలిపారు. కాకతీయ, ఉస్మానియా మెడికల్‌ కళాశాలల ఫోరెన్సిక్‌ నిపుణులు వేర్వే రుగా తమ నివేదికలను కరీంనగర్‌ జిల్లా ఫస్ట్‌క్లాస్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ కుషకు అందజేసి ఆయన ద్వారా హైకోర్టుకు పంపనున్నారు. వీడియో సీడీలను సీల్డ్‌కవర్‌లో భద్రపరిచి, సీజ్‌ చేశారు.  



ఎలాంటి గాయాలు లేవు: కృపాల్‌సింగ్‌

రీపోస్టుమార్టం అనంతరం కాకతీయ మెడికల్‌ కళాశాలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుడు కృపాల్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. మృతదేహాన్ని ఖననం చేసి 27 రోజులు అవుతుండడంతో పూర్తిగా కుళ్లిపోయిందని, దీంతో పోస్టుమార్టం ఆసల్యమైందని తెలిపా రు. శరీరం కుళ్లిపోయినందున క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడని ఇప్పుడు చెప్ప లేమన్నారు. తలపై ఎలాంటి గాయాలు లేవని, ఎముకలు విరగలే దని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎస్‌ ఎల్‌ రిపోర్టు నెలరోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నా రు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 60 మంది ని విచారించినట్లు పెద్దపల్లి డీసీపీ కె.విజేందర్‌ రెడ్డి చెప్పారు.



ముమ్మాటికీ హత్యే : మధుకర్‌ తల్లిదండ్రులు

మధుకర్‌ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్య కూడా విలేకరులతో మాట్లాడారు. మధుకర్‌ మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఎముకలు ఎక్కడికక్కడ విరిగిపోయి ఉన్నాయన్నారు. మర్మంగా లను కోసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఎడమ కన్ను లేదన్నారు. ఇదే విషయాన్ని అక్కడ డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. తమ కొడుకుది ముమ్మా టికీ హత్యేనని పునరుద్ఘాటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top