గజగజ

గజగజ


చలిలో సం‘క్షామం’  

వణుకుతున్న విద్యార్థులు

పలుచని దుప్పట్లు.. విరిగిన కిటికీలు..

వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి


 

నర్సంపేట : చలి పులి పంజా విసురుతోంది.. తట్టుకోలేక ‘సంక్షేమ’ విద్యార్థులు గజగజలాడుతున్నారు.. కప్పుకునేందుకు దుప్పట్లు లేక.. కాళ్లు కడుపులోకి పెట్టుకొని వణుకుతున్నారు.. కునుకుకు దూరమవుతున్నారు.. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు పగిలిపోయి.. పెదాల నుంచి రక్తం కారుతోంది.. సరిపోయేన్ని దుప్పట్లు లేక.. అద్దె భవనాలు.. శిథిలమైన గదుల్లో శీతలంలోనే తలదాచుకుంటున్నారు.. మూడు రోజులుగా   జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ఉదయాన్నే బడికి వెళ్లేందుకు చన్నీళ్ల స్నానం చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.. ఊకదంపుడు మాటలకే పరిమితమయ్యే నేతలు విద్యార్థులకు దుప్పట్లు అందిస్తే మేలు చేసినవారవుతారు. జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు 188 ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ ఆశ్రమ పాఠశాలలు మరో 40 వరకు ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 6,752 వుంది, బీసీ హాస్టళ్లలో 4,260, ఎస్టీ హాస్టళ్లలో 8,148 వుంది, అప్పర్ ప్రైవురీ ఆశ్రమ పాఠశాలల్లో 8,368 వుంది విద్యార్థులు ఉన్నారు. 27,528 వుంది విద్యార్థులు సంక్షేవు హాస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం వారికి అందించిన దుప్పట్లు చాలీచాలకుండా.. పలచగా ఉండడంతో చలి తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



అవి కప్పుకున్నా ఏ మూలకు సరిపోని పరిస్థితి. చేసేది లేక కొందరు విద్యార్థులు తమ ఇళ్ల నుంచి దుప్పట్లు  తెచ్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఆ మాత్రం స్థోమత లేని విద్యార్థులు చలిలో వణుకుతూ నిద్రకు దూరమవుతున్నారు. అంతేకాక హాస్టళ్లకు 25 శాతం అద్దె భవనాలే ఉన్నాయి. దీంతో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భవనాల కిటికీలు, తలుపులు శిథిలావస్థకు చేరారుు. సొంత భవనాలు ఉన్న చోట కొంత మేరకు సౌకర్యాలు పర్వాలేదు. అయితే ప్రస్తుతం పెరిగిన చలి తీవ్రత వల్ల శ్వాస సంబంధ వ్యాధులు, జ్వరాలు, చర్మవ్యాధులకు గురవుతున్నారు. వీరికి వైద్యం అందించే నాథుడు లేడు.

 

ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లేందుకు చన్నీళ్ల స్నానాలు చేస్తుండడంతో అస్వస్థత పాలవుతున్నారు. చలి తీవ్రతకు విద్యార్థుల పెదవులు, చేతులు, కాళ్లు పగిలి రక్తం కారుతోంది. చలి కాలంలో విద్యార్థులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దుప్పట్లు పంపిణీ చేయూల్సిన అవసరం ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top