బడి పిల్లల బియ్యం బుక్కిన డీలర్లు


గీసుకొండ : మండలంలో అనేక మంది రేషన్‌డీలర్లు  బడిపిల్లలకు వండిపెట్టాల్సిన బియ్యాన్ని బయట అమ్ముకుంటూ కాసులు దండుకున్నారు. మధ్యాహ్న భోజనం కోసం కేటాయించిన బియ్యాన్ని పాఠశాలలకు చేరవేయకుండా మధ్యలోనే దారి మళ్లించారు. రెవెన్యూ, విద్యాశాఖ అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో వారి దందా ఇష్టారాజ్యంగా సాగినట్లు తెలుస్తోంది. మండలంలో జెడ్పీ హైస్కూళ్లు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 43 ఉండగా 4125 మంది విద్యార్ధులు చదువుతున్నారు. విద్యార్ధుల సంఖ్యకనుగుణంగా నెలనెలా రెవెన్యూ అధికారులు బియ్యం కోటాను కేటాయిస్తున్నారు. ఇలా కేటాయించిన బియ్యాన్ని  సదరు డీలర్లు వారికి కేటాయించిన పాఠశాలలకు వెంటనే అందజేయాల్సి ఉంటుంది.



కానీ అలా జరగటం లేదు. తమ పాఠశాలకు బియ్యం కావాలని సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లు డీలర్లను కోరితే తప్ప వారు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. అంతేగాక తమ పాఠశాలకు ఎంత బియ్యం కేటారుుంచారనే విషయం చాలా మంది హెడ్మాస్టర్లకు తెలియడం లేదు. డీలర్లు నెల వారి కోటా మొత్తం ఇచ్చారా..?  వాటిలో ఎన్ని విద్యార్ధులకు వండి పెట్టారు...?, మిగిలినవి ఎన్ని..? అనే స్పష్టమైన లెక్కలు  విద్యాశాఖవారి వద్ద లేకపోవడం గమనార్హం. 2010 నుంచి 2012 వరకు వీటికి సంబంధించిన లెక్కలు తహసీల్దారు కార్యాలయంలోనే స్పష్టంగా లేవని తెలుస్తోంది. డీలర్లకు కేటాయించిన బియ్యం మొత్తాన్ని పాఠశాలలకు పూర్తిగా పంపించారా ? లేదా ? అనే విషయాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించడం లేదు.



కాగా 2012 నుంచి మూడేళ్లకు సంబంధించి డీలర్లు సుమారు 500 క్వింటాళ్ల బియ్యంను పంపిణీ చేయకుండా అమ్ముకున్నట్లు తెలిసింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు జాన్‌పాక ప్రాథమికోన్నత పాఠశాలకు 22 క్వింటాళ్లు,  బొడ్డుచింతలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు 15 క్వింటాళ్లు, ధర్మారం ప్రాథమిక పాఠశాలకు 15.91 క్వింటాళ్లు, ఊకల్ ప్రాథమికోన్నత పాఠశాలకు 4 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేయకుండానే డీలర్లు అమ్ముకున్నారని తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top