పొన్నాల’కు తలనొప్పి

పొన్నాల’కు  తలనొప్పి


తెరపైకి రాంపూర్ భూముల వ్యవహారం

శాసనసభలో సుదీర్ఘ చర్చ   

అదే సమయంలో అధికారుల సర్వే


సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. సుదీర్ఘకాలంగా వివాదంలో ఉన్న ధర్మసాగర్ మండలం రాంపూర్‌లోని అసైన్డ్ భూముల వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. దీనిపై శాసనసభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది.


పీసీసీ అధ్యక్షుడిగా సాధారణ ఎన్నికలను ఎదుర్కొన్న పొన్నాలకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతోపాటు స్వయంగా ఆయన కూడా ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి పొన్నాల నాయకత్వంపై సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరుగుతున్నారు. తాజాగా రాంపూర్ అసైన్డ్ భూముల వ్యవహారం జిల్లాలోని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

శాసనసభలో చర్చ.. రాంపూర్‌లో సర్వే..


రాంపూర్‌లోని అసైన్డ్ భూముల వ్యవహారంపై శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే రెవె న్యూ అధికారులు సర్వే నిర్వహించారు. రాంపూర్ పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతంలోని పొన్నాలకు చెం దిన తిరుమల హెచరీస్ భూముల్లో బుధవారం రెవె న్యూ, ల్యాండ్ సర్వే అధికారులు సర్వే చేశారు. కలెక్ట ర్ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ధర్మసాగర్ ల్యాండ్ సర్వే డి ప్యూటీ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్, ఆర్‌ఐ కరణ్‌బాబు, రాంపూర్ వీఆర్‌వో సింగ్‌లాల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

 

ఇదీ నేపథ్యం

ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన భూములలోని సర్వే నంబర్లు 337, 339/2లోని 8.28 ఎకరాలను అదే గ్రామానికి చెందిన దళితులకు 1971లో ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అనంతరం ఈ భూములను ప్రభుత్వం 1987లో ఏపీఐఐసీకి అప్పగి స్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ఈ భూముల ను పొన్నాల లక్ష్మయ్యకు చెందిన తిరుమల హెచరీస్ కు అప్పగించింది. దళితులకు చెందిన భూములను తిరుమల హెచరీస్ అక్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకుందని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్డ్ భూమిని పొ న్నాలకు అప్పగించిందంటూ అప్పట్లో వివాదం చెల రేగింది.



తిరుమల హెచరీస్ గడువులోపు పరిశ్రమ స్థాపించలేదు. పౌల్ట్రీ పరిశ్రమలో వచ్చిన బర్డ్‌ప్లూ కారణంగా స్థాపించలేకపోయామని తిరుమల హెచరీస్ ఏపీఐఐసీకి వివరణ ఇచ్చింది. గడువు ముగియడంతో 2013లో భూముల కేటాయింపు రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా అమ లు కాలేదు. సాధారణ ఎన్నిల ముందు ఈ భూములపై వివాదం రేగింది. దీనిపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట ప్రకారం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా శిక్షగా ఉంది. తమ ఆదీనంలో అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలితే మూడు నెలల్లో వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి. లేని పక్షంలో శిక్షకు అర్హులు అవుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top