జూన్‌ 1న సంగారెడ్డికి రాహుల్‌


‘తెలంగాణ ప్రజా గర్జన’ సభలో పాల్గొంటారు

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ వెల్లడిl

నియంతృత్వానికి ట్రేడ్‌మార్క్‌గా టీఆర్‌ఎస్‌




సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జూన్‌ 2న సంగారెడ్డిలో జరిగే ‘తెలంగాణ ప్రజాగర్జన’ సభలో పాల్గొంటా రని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ ల్యాలను సభలో ఎండగడతామన్నారు. రైతు లు మొదలుకుని మైనారిటీల దాకా అన్ని వర్గాలనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసగి స్తున్న వైనాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు.



బుధవారం ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమైన ఆయన, గురువారం గాంధీభవన్‌లో విలేకరు లతో మాట్లాడారు. భూ సేకరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటిం చారు. భూ నిర్వాసితులకు అన్యాయం చేసే ఈ చట్టాన్ని ప్రశ్నించి తీరతామన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చెప్పే మాటలకూ చేసే పనులకూ పొంతనే లేదన్నారు. ప్రచారం, ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదన్నారు.



 ‘తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, నియామ కాలు జరుగుతాయని, సమస్యలు పరిష్కార మవుతాయని ఆశించిన అన్ని వర్గాల ప్రజ లనూ కేసీఆర్‌ మోసగించారు. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వం, అక్రమాలు, అహం కార ప్రవర్తన, గొప్పలు చెప్పుకోవడం, అసత్య ప్రచారం పెరిగాయి. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అహంకారానికి, నియంతృత్వానికి ట్రేడ్‌ మార్క్‌గా, అంతులేని అవినీతికి  మారు పేరుగా మారింది. రైతు ఆత్మహత్యల్లో దేశం లోనే తెలంగాణది రెండో స్థానం. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్‌ మాత్రం చేతలు మాని సిగ్గుమాలిన విమర్శలు, మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు.



 నిరుద్యోగులు, రైతులు, మహిళలు, గిరి జనులు, మైనారిటీలు... ఇలా అన్ని వర్గా లనూ మోసగించారు. రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చే యత్నం జరుగుతోంది. మీడియా సంస్థలనూ బెదిరిస్తున్నారు. మీడి యాకు స్వేచ్ఛ లేకుండా పోయింది’’ అంటూ దుయ్యబట్టారు. సిద్ధాంతాలు, విలువలంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు తమ పార్టీలోకి రావాలంటూ కాంగ్రెస్‌ వాళ్ల కాళ్లెం దుకు పట్టుకుంటున్నారని ఉత్తమ్‌ ప్రశ్నిం చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేత లెవరూ బీజేపీలోకి వెళ్లరన్నారు. బీజేపీ నేతలే కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారని తెలిపారు.



ప్రతి పల్లె నుంచీ కనీసం 10 మంది

సంగారెడ్డి సభకు ప్రతి పల్లె నుంచీ కనీసం 10 మందిని తరలించాలని పీసీసీ నిర్ణయించింది. సభ ఏర్పాట్లపై ఉత్తమ్‌ అధ్యక్షతన పీసీసీ కార్యవర్గం గాంధీభవన్‌లో చర్చించింది. సభ ను విజయవంతం చేయాలని సూచించారు. ‘రాహుల్‌కు హైదరాబాద్‌ నుంచి సంగారెడ్డి దాకా భారీ వాహన శ్రేణితో స్వాగతం పల కాలి. 45 కిలోమీటర్ల మేర కాన్వాయ్‌ ప్రద ర్శన ఉండాలి’ అని పేర్కొన్నారు.



కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన డాక్టర్‌ రామచంద్రు నాయక్‌ తన అనుచరులతో పాటు గురువారం ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంద ర్భంగా వచ్చే ఎన్నికల్లో డోర్నకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆయనేనని ఉత్తమ్‌ ప్రకటించారు.   బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top