అంగట్లో ప్రశ్నపత్రాలు!


► విద్యార్థుల చేతుల్లో 7వ తరగతి

► సామాన్యశాస్త్రం ఇంగ్లిష్‌ మీడియం పేపర్‌ 

► వనపర్తిలో ఒకరోజు ముందే వెలుగులోకి 

► క్వశ్చన్‌ పేపర్‌ ధర రూ.100 

సాక్షి వనపర్తి : ఏడో తరగతి సామాన్యశాస్త్రం ఇంగ్లిష్‌ మీడియం పేపర్‌ వనపర్తిలో ఒకరోజు ముందుగానే విద్యార్థుల చేతుల్లోకి చేరింది. ప్రస్తుతం 10వ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన రోజు నుంచి ఇదేతంతు కొనసాగుతోందని సమాచారం.

 

స్థానికంగా ఉన్న మీసేవా కేంద్రాలు, జిరాక్స్‌ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు ప్రశ్నపత్రాలకు అడ్డాగా మారాయి. క్వశ్చ¯ŒS పేపర్‌ను రూ.100కు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో విద్యార్థులు కొందరు పేపర్‌ కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా పంపుకుంటున్నారని తెలుస్తోంది. గురువారం జరగాలి్సన సామాన్యశాస్త్రం పేపర్‌ను ఇలానే ఓ విద్యార్థి కొని తెచ్చుకోవడంతో తండ్రి మందలించాడని సాక్షిదృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయమై నిజానిజాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగడంతో అసలుసంగతి బయటపడింది. పరీక్ష ముందురోజే క్వశ్చన్‌ పేపర్‌ తెచ్చుకుని విద్యార్థులు బట్టీపట్టడం, లేదా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడటం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం మార్కెట్లో దొరకడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top