నాగోబా దర్బార్‌లో నిరసన సెగ

నాగోబా దర్బార్‌లో నిరసన సెగ - Sakshi


గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు విద్యార్థి, ఆదివాసీ సంఘాల డిమాండ్

 

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: నాగోబా జాతరను పురస్కరించుకుని బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో నిర్వహించిన గిరిజన దర్బార్ నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. గిరిజన యూనివర్సిటీ తరలింపుపై విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, ఆదివాసీ సం ఘాల నాయకులు నిరసనకు దిగారు. దర్బార్‌కు వస్తున్న మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలను అడ్డుకున్నారు. దర్బార్‌లో కూడా వీరి ప్రసంగాలకు అడ్డు తగి లారు. నిరసన వ్యక్తం చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



గిరిజన యూనివర్సిటీని వరంగల్‌కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాల్సిన ఈ వర్సిటీని వరంగల్ జిల్లాకు తరలిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వద్ద ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. సమక్క-సారక్క జాతరకు రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిం చిన నాగోబా జాతరకు రూ.10లక్షలతో సరిపెట్టడం ఎంతవరకు సబ బని ప్రశ్నించారు. గిరిజనవర్సిటీని జిల్లాలోనే స్థాపించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి జోగు రామన్న అన్నారు. తమపై దండయాత్రలు చేస్తే సహించేది లేదని ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top