ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్!

ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్! - Sakshi


హైదరాబాద్:ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్  ఏదొక రూపంలో అధికమవుతూనే ఉంది. టికెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ టార్చర్ కు అద్దం పడుతోంది. శనివారం రాత్రి న్యూధనుంజయ్ ట్రావెల్స్ కు చెందిన  బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరింది. 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆ బస్సు ఒక్కసారిగా పటాన్ చెరువు వద్ద నడిరోడ్డిపై ఆగిపోయింది.


 


అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బస్సు యాజమాన్యం చేతులెత్తేసి తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. దీంతో  ఆదివారం ఉదయం 9 గం.లకు వరకూ ప్రయాణికులు రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, గర్భిణిలు ఉన్నా వేరే వెహికల్ ను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేకపోవడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. ఈ ఉదంతాన్ని చూస్తే ప్రైవేట్ ట్రావెల్సా మజాకా? అన్నట్లు ఉంది కదూ..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top