పురుడు పోస్తారనుకుంటే.. ప్రాణాలు తీశారు!

పురుడు పోస్తారనుకుంటే.. ప్రాణాలు తీశారు!


కొడంగల్ రూరల్: ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి తల్లీబిడ్డలు బలయ్యారు. పురుడు పోస్తారనుకొని వస్తే.. ఏకంగా ప్రాణాలు తీశారు. ఈ ఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో చోటుచేసుకొంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్‌కు చెందిన శ్యామప్ప, మల్లమ్మ దంపతుల రెండో కుమార్తె సావిత్రమ్మ(20)ను మహబూబ్‌నగర్ జిల్లా దామరగిద్ద మండలం దేశాయిపల్లికి చెందిన గొల్ల నీలప్పకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. గర్భిణి అయిన సావిత్రమ్మను ప్రసవం కోసం తల్లిదండ్రులు కోస్గిలోని బాలాజీ నర్సింగ్ హోంలో గురు వారం రాత్రి చేర్చారు.  



వైద్యులు అందుబాటులో లేకపోవడం.. పురిటినొప్పులు ఎక్కువై రెండు గంటల పాటు నరకయాతన అనుభవించింది. సాధారణ డెలివరీ చేయడం కోసం నర్సులు చేసిన ప్రయత్నాలు వికటించాయి. చివరకు మగశిశువును బయటికి తీశారు. అప్పటికే శిశువు మృతి చెందాడు. కొద్దిసేపటికి సావిత్రమ్మ కూడా మృతి చెం దిం ది. సావిత్రమ్మ పరిస్థితి విషమంగా ఉం దం టూ ఆస్పత్రి యాజమాన్యం జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసింది. తమపై నింద రాకుండా ఉండేందుకు ప్రయత్నించింది. అప్పటికే సావిత్రమ్మ మృతి చెం దిన విషయం బయటికి పొక్కడంతో మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున గుమిగూడారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం ఆస్పత్రికి తాళం వేసి పరారైంది. మృత శిశువును ఆస్పత్రి ఎదు ట ఉంచి  బంధువులు ఆందోళనకు దిగారు.



 నర్సుల చికిత్స వల్లే తల్లీబిడ్డ మృతి..

 నైపుణ్యం లేని నర్సుల చికిత్స వల్లే తల్లీబిడ్డ మృతి చెందారని జిల్లా ఉప వైద్యాధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో వివరాలను సేకరించారు. ఆస్పత్రి నిర్వహిస్తున్న పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు. కొన్నింటిని ఆమె తమ వెంట తీసుకెళ్లారు. పోస్టుమార్టం రిపోర్టు, ఆస్పత్రి రికార్డుల పరిశీలనలతో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు  తెలిపారు.



 రాజీకి పోలీసుల యత్నం

 ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై పోలీ సుల వైఖరిని పలువురు విమర్శించారు. నారాయణపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి బాధితులు, యాజమాన్యంతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. విషయం జిల్లా వైద్య శాఖాధికారులకు తెలియడంతో నాటకీయ పరిణామాల మధ్య మృతురాలి తండ్రి శ్యామప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top