విద్యాసాగర్రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ

విద్యాసాగర్రావు 'ఉనికి' పుస్తకావిష్కరణ - Sakshi


హైదరాబాద్ :  మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ  కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత జానారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ చేతుల మీదగా పుస్తకం తొలి ప్రతిని ప్రణబ్ అందుకున్నారు.



ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ విద్యాసాగర్రావుతో తనకు 30 ఏళ్ల స్నేహం ఉందని, ఆనాడు ప్రతిపక్షంలో విద్యాసాగర్రావు హుందాగా వ్యవహరించారన్నారు.  'ఉనికి' పుస్తకంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, అయితే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు పలువురు హాజరు కావటమే ఉనికికి ఓ 'ఉనికి' ఏర్పడిందని సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. పలు పత్రికల్లో  తాను రాసిన వ్యాసాలను సంకలనం చేసి ఈ పుస్తకం వేయటం జరిగిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top