సకల సౌకర్యాలు

సకల సౌకర్యాలు - Sakshi


* గోదావరి పుష్కరాలకు 13 ఘాట్‌లు

* స్థలాలు పరిశీలించిన కలెక్టర్

నవీపేట : జిల్లాలో ప్రతిపాదించిన పదమూడు పుష్కర ఘాట్‌ల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలి పారు. నవీపేట మండలంలోని కోస్లీ, బినో ల, తుంగిని గ్రామాల శివారులో గల గోదావరి నదీతీరాలను శుక్రవారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరుగనున్నందున ఏర్పాట్ల కోసం వివిధ శాఖల అధికారులతో సమావేశం జరుపుతామన్నారు. గతంలో కంటే ఈసారి పుష్కర ఘాట్‌లు ఎక్కవ సంఖ్యలో నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘాట్‌ల వద్ద స్నానపు గదులు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, దారుల విస్తరణ వంటి సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.



దూరప్రాం తాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారుల తో సమీక్ష అనంతరం పనులను ప్రారంభిస్తామన్నా రు. యంచ గ్రామ శివారులో గల  బాసర బ్రిడ్జికి ఇవతల పుష్కర ఘాట్‌ను ఏర్పాటు చేయాలని, ఆ ప్రాం తంలో గత పుష్కరాలలో కూడా అనేక మంది భక్తు లు స్నానాలు ఆచరించారని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నర్సింగ్ రావ్, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.

 

కందకుర్తిలో అదనంగా రెండు ఘాట్లు

రెంజల్/నందిపేట : గోదావరి పుష్కరాలకు కందకుర్తిలో అదనంగా మరో రెండు ఘాట్లు, తాడ్‌బిలోలిలో ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కందకుర్తి, తాడ్‌బిలోలి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యను అడిగితెలుసుకున్నారు. పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, స్త్రీలు బట్ట లు మార్చుకునే గదులు, విశ్రాంతి గదులు, కందకుర్తి గోదావరిలోని పురాతణ శివాలయం నుంచి నదిపై నిర్మించిన వంతెన వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నిధుల కొర త లేదని, పుష్కరక్షేత్రాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించనున్నామన్నారు.



కందకుర్తి వంతెనపై నుంచి మహారాష్ట్రలోని సంగమేశ్వరాలయాన్ని పరిశీలించారు. మూడు నదుల కలయిక స్థలమైన కందకుర్తికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని స్థానిక నాయకులు కలెక్టర్‌కు వివరించారు. కందకుర్తి విశిష్టను అడిగితెలుసుకున్నారు. అక్కడి నుండి పోలీస్ జీపులో బోర్గాం చేరుకున్నారు. గోదావరికి వెళ్లే రోడ్డు గురించి రైతులు వివరించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సంబందిత అధికారులతో మాట్లాడు రూ. 40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మెటల్‌రోడ్డు నిర్మించుకోవాలన్నారు. తాడ్‌బిలోలి గ్రామంలో పుష్కరాల ఏర్పాట్లకు రూ. 2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు.  నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామ శివారులో గల గోదావరి నదీతీరాన ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.



ఇక్కడగల పురాతన చరిత్ర కలిగిన ఉమమహేశ్వర ఆలయాన్ని సందర్శించారు.  అనంతరం కిలో మీటర ు దూరం వరకు కాలిబాటన నడిచి గోదావరి నదిలో మునిగిపోయిన ఉమ్మెడ పాత గ్రామాన్ని సం ద ర్శించారు. పాత గ్రామంలో గల విగ్నేశ్వర, కాలభైరవ, పోచమ్మ ఆలయాలను, వాటిలోని అతి పురాతన విగ్రహాలను, రాళ్లకు చెక్కిన జైనుల శిలాశాసనాలను పరిశీలించారు. పురాతన విగ్రహాల ఫొటోల ను, వాటికి సంబంధించిన చరిత్రను తనకు అందుబాటులో ఉంచాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో యాదిరెడ్డి, డీఎస్పీ ఆనంద్‌కుమార్, బోధన్ ఆర్‌డీవో శ్యాం ప్రసాద్‌లాల్, డీపీవో కష్ణమూర్తి, జిల్లా వైధ్యాధికారి గోవింద్ వాగ్మారే, ఐకేపీ పీడీ వెంకటేశం, బోధన్ డీఎస్‌పీ రాంకుమార్, ఎంపీపీ మోబిన్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు నాగభూషణం రెడ్డి, సర్పంచ్‌లు ఖలీంబేగ్, తెలంగాణ శంకర్, జావీదోద్దిన్, విండో చెర్మైన్‌లు అహ్మద్‌బేగ్, సాయరెడ్డి, తశీల్దార్ బావయ్య, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు....

 

గ్రామస్తుల వినతి

ఉమ్మెడ గ్రామం నుంచి  పుష్కరఘాట్‌తో పాటు పాత గ్రామం వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచు పోశెట్టి, ఎంపీటీసీ సభ్యుడు దూడ వెంకటేష్‌లు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top