పెళ్లి పందిరిలో నటుడు ‘ప్రకాష్‌రాజ్’ సందడి
మహబూబ్‌నగర్ (షాద్‌నగర్) ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ షాద్‌నగర్ లోని ఓ పెళ్లికి వచ్చి సందడి చేశారు. శనివారం పట్టణంలోని గ్రీన్‌పార్క్ ఫంక్షన్ హల్లో స్వప్న, కుమారస్వామి పెళ్లికి ఆయన హజరయ్యారు. పెళ్లిలో నిరాడంబరంగా అందరితో పాటు కూర్చుని వధువరులను ఆశీర్వదించారు. పెళ్లికి వచ్చిన యువకులను, బంధువులను కలుస్తూ వారితో ఫోటోలు దిగారు.