పోలీస్ క్వార్టర్స్‌లో పెట్రోల్ బంక్‌లు!

పోలీస్ క్వార్టర్స్‌లో పెట్రోల్ బంక్‌లు! - Sakshi


జగిత్యాల :

 పోలీస్‌క్వార్టర్లలో పెట్రోల్ బంక్‌ల ఏర్పా టు చేయాలంటూ ఎస్పీ శివకుమార్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. జగిత్యాల, రామగుండంలో పోలీసుల నిర్వహణలో నడిచేలా బంకులు ఏర్పాటు చేయాలని  అందులో సూచించారు. ఇప్పటికే ఇలాంటి బంక్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో జాతీయ రహదారిలో 13వ పోలీస్ బెటాయలిన్ కేంద్రం గా పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.



 అనువుగా జగిత్యాల, రామగుండం

 జగిత్యాల పోలీస్ స్టేషన్ సమీపంలో రెండెకరా ల్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. అలాగే రామగుం డంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోనూ స్థలం చాలా ఉంది. ఈ స్థలాల్లో బంకులను ఏర్పాటు చేస్తే పోలీసుల కు ఆదాయం రావడంతోపాటు నాణ్యమైన పె ట్రోల్ అందుతుందని ఎస్పీ భావిస్తున్నట్లు స మాచారం. పైగా పోలీసు వాహనాలకు నిత్యం వినియోగించే డీజిల్, పెట్రోల్‌పై నిర్వహణభారాన్ని తగ్గించుకునే వీలుంటుందని సీఐ నరేష్‌కుమార్ తెలిపారు.



 ప్రధాన కూడలిలో పెట్రోల్ బంకు

 ఎస్పీ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. జగిత్యాలలో పోలీస్ క్వార్టర్స్ వద్ద బంక్ ఏర్పాటు కానుంది. ఈ స్థలం ప్రధాన కూడలిలోనే ఉంది. అలాగే నిజామాబాద్, ధర్మపురి, మంచిర్యాల వైపు వెళ్లే 63వ జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. షాపింగ్ కాంప్లెక్, ఆర్డీవో, తహశీల్దార్, కోర్టు కా ర్యాలయాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రి సమీపంలోనే ఉన్నాయి. ఈ ప్రాం తంలో బంక్ ఏర్పాటు చేస్తే అమ్మకాలు పెరిగే అవకాశముం దని పోలీసులు చెబుతున్నారు.



 అడ్డుకునే యత్నాల్లో బంక్ యజమానులు

 జగిత్యాలలో పెట్రోల్ బంక్‌లన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు నిర్వహిస్తున్నారు. వీరికే కిరోసిన్ డీలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. వీరంతా పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు మొద టి నుంచీ ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసుల ఆధ్వర్యంలో బంక్ ఏర్పాటు చేస్తే తమ కల్తీ పెట్రోల్ అమ్మకాలకు గండి పడుతుందని భావిస్తున్న యజమానులు.. ఏర్పాటును అడ్డుకునేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్పీని ఒప్పించడం పెద్ద విషయం కాదని, ఆయన తమ మాట వింటారని యజమానులు బహిరంగంగా చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top