టీడీఎల్పీకి గదులను కొనసాగించరూ..

టీడీఎల్పీకి గదులను కొనసాగించరూ.. - Sakshi


స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి తదితరుల వినతి


 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పీకి కేటాయించిన గదులను యథావిధిగా కొనసాగించాలని స్పీకర్ మధుసూదనాచారిని టీడీపీ నాయకులు కోరారు. మంగళవారం బీఏసీ సమావేశం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఈ మేరకు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే సభ ముగిశాక తనను కలవాలని స్పీకర్ వారికి సూచించడంతో రేవంత్‌రెడ్డి, వీరయ్యలతోపాటు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు మరోసారి స్పీకర్‌ను కలసి ఈ అంశంపై విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా శాసనసభ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించేందుకు స్పీకర్ కార్యాలయం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌ను మళ్లీ కలసి గదుల కేటాయింపును కొనసాగించేలా కోరాలనే ఆలోచనతో టీడీపీ నాయకులున్నారు.


గతంలో టీడీఎల్పీకి కేటాయించిన గదులను ఆయా అసెంబ్లీ కమిటీల చైర్మన్లకు కేటాయిస్తూ కొంతకాలం కిందట అసెంబ్లీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తమ పార్టీకి ఎమ్మెల్యేలున్నందున టీడీఎల్పీ కార్యాలయం కోసం వాటిని కొనసాగించాల్సిందిగా టీడీపీ నాయకులు కోరుతున్నారు. ‘మహా’ ఒప్పందంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే యోచన అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయాలనే యోచనలో టీటీడీపీ ఉంది. ఈ ఒప్పందాలు తెలంగాణకు నష్టదాయకమని, వాటిని రద్దు చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్‌కు వినతిపత్రాన్ని సమర్పించాలని భావి స్తోంది. వినతిపత్రం సమర్పణకు సమ  యం ఇవ్వాల్సిందిగా గవర్నర్ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు కోరినట్లు సమాచారం. గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకగానే ఆ మేరకు వినతిపత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top