పచ్చని పండుగ


పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తెలంగాణను పచ్చదనంగా మార్చాలన్న లక్ష్యంతో హరితహారం పథకానికి సర్వం సిద్ధమైంది. ఉన్నత లక్ష్యంతో 3న ప్రారంభం కానున్న కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ప్రజల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 

 

 ముకరంపుర/రారుుకల్ : హరితహారం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతీ నియోజకవర్గ పరిధిలో 40 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలోని 13 నియోజకవర్గాలకు 5.20 కోట్ల మొక్కలు అవసరం. 565 నర్సరీల్లో ముందస్తుగానే మొక్కలు పెంచగా అవసరమైన స్థారుులో పెరగకపోవడంతో తొలి దశలో జిల్లాలో 3.05 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు.

 

 సెప్టెంబర్‌లోగా మిగిలిన మొక్కలు నాటేందుకు నిర్ణరుుంచారు. హరితహారంలో భాగంగా జిల్లాలో రూ.50 కోట్ల మేర నిధులు వెచ్చించనున్నారు. పొలం గట్లపై కోటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉంచారు. 500 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచనున్నారు. పండ్ల మొక్కలు పెరగకపోవడంతో వాటిని కొనుగోలు చేసి నాటించే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలను భాగస్వామ్యం చేశారు. నాలుగైదు రోజులుగా కళాజాత ప్రదర్శనల ద్వారా విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించగా, గుంతలు తవ్వకం మొదలెట్టారు. గ్రామాల్లో ఉపాధిహామీ ద్వారా ఉచితంగా మొక్కలు సరఫరా చేయనున్నారు. పట్టణాల్లో రవాణా ఖర్చులు ప్రజలే భరించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ ఇంటికి స్థలాన్ని బట్టి 3 నుంచి 15 మొక్కలు ఇవ్వనున్నారు.

 

  ఇల్ల వద్ద ప్రజలు కోరుకున్న మొక్కలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. హరితహారం విజయవంతానికి కలెక్టర్ నీతూప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గ్రామ, మండలస్థారుులో ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాస్థాయిలో ఏజేసీ నాగేంద్ర మానిటరింగ్ ఆఫీసర్‌గా నియమించారు. నోడల్ అధికారులుగా అటవీశాఖ సామాజిక వనం, తూర్పు. పశ్చిమ డీఎఫ్‌వోలు ముగ్గురిని నియమించారు. డ్వామా పీడీ గణేశ్, ఉద్యానశాఖ ఏడీ జ్యోతిని నోడల్ అధికారులుగా నియమించారు.

 

 ట్రీగార్డుల్లోనూ చేయి కలపాలి

 మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా అంతే ముఖ్యం. మొక్కుబడిగా కార్యక్రమం విజయవంతం చేయడం అసాధ్యం. మొక్కల సంరక్షణకు బాధ్యతలు అప్పగించిన కలెక్టర్ నీతూప్రసాద్ వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ట్రీగార్డులకు సహకారం అందించాలని కోరారు. అనుకున్నస్థారుులో దాతలు ముందుకు రాలేదు. సామాజిక బాధ్యతగా గుర్తించి ట్రీగార్డులు అందించేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరముంది.

 

 సమ్మెల గండం

 కేసీఆర్ మానసపుత్రికగా రూపొందిన హరితహారం పథకాన్ని సమ్మె రూపంలో గండం ఏర్పడుతోంది. మొక్కలు నాటడంలో కీలకపాత్ర వహించే ఉపాధిహామీ సిబ్బంది సమ్మెలో ఉండగా... పంచాయతీ కార్మికులు గురువారం నుంచి సమ్మెలోకి దిగుతుండడంతో హరితహారంపై ప్రభావం పడనుంది. జూలై 1 నాటికే గుంతల తవ్వకం పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోరుుంది. కేవలం రెండు లక్షల గుంతలే పూర్తయ్యూరుు. సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఇబ్బందులు తప్పడం లేదు.

 

 లభించే మొక్కలివే...

 వేప, సీమతంగెడు, నల్లతుమ్మ, తుమ్మ, ఈత, కానుగ, ఉసిరి, సుబాబుల్, నేరేడు, సీమచింత, అల్లనేరేడు, చింద, సరుగుడు, టేకు, మామిడి, జామ, సీతాఫలం, మునగ, కరివేప, సర్కారుతుమ్మ, రావి, ఎర్రచందనం, వెదురు, సిల్వర్ ఓక్, పచ్చతురారుు, గుల్మొహార్, రేల, నిద్రగన్నేరు తదితర మొక్కలు అందుబాటులో ఉన్నారుు.

 

 ఏ మొక్కలు ఏ ప్రదేశాల్లో నాటవచ్చు

 పంట పొలాలు : నల్లతుమ్మ, గిరిశనము, వేప, సీమతంగెడు, కానుగ, ఉసిరి, సుబాబుల్, నేరేడుఇళ్లు : వేప, ఉసిరి, మునగ, కానుగ, సీమచింత, చింద, నేరేడు పొలాలగట్లు :  టేకు, ఉసిరి, మామిడి పాఠశాలలు, కార్యాలయూలు : కానుగ, వేప, దిరిశనము, బాహీనియా, గుల్‌మొహర్, టూబుబియా, ఎడాకులపాల, మామిడి, బోగన్‌విల్లియా, టైకోమ సరిహద్దులు : టేకు, సీమతుమ్మ, వేప, సీమతంగెడు, ఉసిరి, నీలగిరి, సుబాబుల్, నేరేడు చెరువు లోతట్టు ప్రాంతాలు : నల్ల తుమ్మ, నేరేడు, తెల్లమద్ది, చెరువు గట్లపై ఈతచెట్లురహదారుల వెంట : సీమతుమ్మ, దిరిశనం, వేప, సీమతంగెడు, సీస్సు, కానుగ, రావి, నిద్రగన్నేరు, నేరేడు, చింత, మామిడి, మర్రి, ఎండాకులపాల

 

 దత్తత తీసుకున్నాం

 జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రతీ మండలంలో హరితహారం పథకంలో గ్రామాలను దత్తత తీసుకున్నాం. పోలీస్ క్వార్టర్స్‌లో దత్తత తీసుకున్నా గ్రామాల్లో మాకు ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేరుస్తాం.        

 - జోయల్ డేవిస్, ఎస్పీ

 

 సమాయత్తం

 హరితహారంలో రెవెన్యూతోపాటు అన్ని శాఖలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి ఇంటింటికి మొక్కలు నాటేలా సమాయత్తం చేశాం. అందరూ సామాజిక బాధ్యతగా ఫీలై మొక్కలు నాటాలి.   

 - కృష్ణభాస్కర్, సబ్‌కలెక్టర్

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top