తెలంగాణలో దశల వారీగా రుణమాఫీ

తెలంగాణలో దశల వారీగా రుణమాఫీ - Sakshi


తెలంగాణ రాష్ట్రంలో దశల వారీగా రుణమాఫీ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. ఈ అంశంపై మంత్రులతో కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు.



తొలిదశ రుణమాఫీ అమలు కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు కేసీఆర్ సూచించారు. అలాగే అసెంబ్లీ కమిటీల నియామకం గురించి కూడా మంత్రులతో కేసీఆర్ చర్చించారు. త్వరలోనే అసెంబ్లీ కమిటీలు ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top