పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడుతున్న జనాలు
తల్లాడ(ఖమ్మం): వేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలుకాగా.. ఇంధనం నేలపాలవుతోంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెట్రోల్ ను పట్టి తెచ్చుకోవడానికి క్యాన్లతో ఎగబడుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమచారం. ట్యాంకర్ బోల్తాపడిందని తెలుసుకున్న స్థానికులు పెట్రోలు కోసం బిందెలు, క్యాన్లు, డబ్బాలతో క్రాస్‌రోడ్డు వద్దకు పరుగులు పెడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.