మారింది స్థావరాలే !


అమ్మకాలు మాత్రం ఆగలేదు..

భారీగా గుట్కా, ఖైనీ విక్రయాలు

స్టాక్ పాయింట్లను పట్టించుకోని అధికారులు

చిరువ్యాపారులపైనే పోలీసుల దాడులు


 


హన్మకొండ : 2016 జూన్ 20న పరకాలలో గుట్కాలు నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు దాడి చేసి రూ.లక్ష విలువైన గుట్కాలు, ఖైనీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వా రం వ్యవధిలోనే జూన్ 27న వర్ధన్నపేటలో పోలీసుల దాడి లో రూ. 1.5 లక్షల విలువైన గుట్కాలు లభ్యమయ్యూరుు. ఇ లా పోలీసుల వరుస దాడులు చేపడుతున్నా గుట్కా అమ్మకా లు తగ్గడం లేదు. గుట్కా అక్రమ వ్యాపారంలో పెద్దలను వ దిలి చిరువ్యాపారులపై దాడులు జరుగుతుండటంతో ఆశిం చిన ఫలితం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుట్కా వ్యాపారానికి స్టాకిస్టు(నిల్వ చేసేవారు) కేంద్ర బిందువులుగా వ్యవహరిస్తున్నారు. గుట్కాలు, ఖైనీలను పెద్ద ఎత్తున నిల్వ చేస్తూ జిల్లా నలుమూలకు సరఫరా చేస్తున్నారు. తనిఖీ చేసే అధికారులు స్టాకిస్టు పాయింట్లపై దృష్టి సారించకుండా చిన్నచిన్న కిరాణ షాపులపై దాడులు చేసి సరిపెడుతున్నారు. దీంతో గుట్కా అమ్మకాలు తగ్గడంలేదు.


 

వరంగల్ కేంద్రంగా..


జిల్లాలో గుట్కా క్రయవిక్రయాలకు వరంగల్ నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాలను పెద్ద ఎత్తున రాత్రి వేళలో హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్ నగరానికి చేరుస్తున్నారు. ఇలా చేరిన గుట్కా, ఖైనీ, పాన్‌మసాలను గతంలో వరంగల్ బీట్‌బజారు, పిన్నావారి వీధిలో ప్రధానంగా నిల్వ చేసేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నగరం మధ్య నుంచి శివారు ప్రాంతాల్లో అనుబంధ గోదాములను ఏర్పాటు చేసుకుని అక్కడ నిల్వ చేయడం ఆరంభించారు. ఆ పారుుంట్ల నుంచి జిల్లా నలుమూలలకు ‘మాల్’ను సరఫరా చేస్తున్నారు. ఏ ఒక్క చోట పర్మినెంట్‌గా గుట్కాలను నిల్వ చేయకుండా తరుచుగా అడ్డా మారుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్ ప్రధాన రహదారులకు సమీపంలో గోదాములు ఏర్పాటు చేశారు. గుట్కాలు, ఖైనీలు పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న గోదాములను వదిలేసి పోలీసులు చిరువ్యాపారులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గుట్కా వ్యాపారుల నుంచి పోలీసుశాఖకు నెలవారీ మాముళ్లు అందుతున్న ఫలితంగానే గోదాములపై దాడులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


 

కొత్త అడ్డాలివే..


విజయవాడ వైపు నుంచి రాత్రి వేళ వచ్చే గుట్కాలు, ఖైనీల ను నాయుడు పంపు జంక్షన్, మామూనూరు సమీపంలో జాతీయ రహదారికి పక్కన ఉన్న గోదాములు, ఇళ్లలో తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు.కాజీపేట సమీపంలో సోమిడి వద్ద గతంలో గుట్కా వ్యాపారుల గోదాం ఉండేది. ఈ విషయం బయటకు పొక్కడం, తరచుగా దాడులు జరుగుతుండటంతో వ్యాపారులు ఇటీవలహన్మకొండ, భీమారం సమీపానికి అడ్డాలు మార్చారు.


     

వరంగల్ బీట్‌బజార్‌ను అడ్డాగా చేసుకున్న గుట్కా వ్యాపారులు అనుబంధ స్టాక్ పాయింట్‌ను ఎల్లంబజార్‌లో ఏర్పాటు చేశారు. డిమాండ్‌ను బట్టి స్టాక్ తీసుకొచ్చి కిరాణ సరుకులతో కలిపి చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.ములుగు, భూపాలపల్లి, పరకాల వైపు ట్రాన్స్‌పోర్‌‌ట వాహనాల్లో గుట్కాను సరఫరా చేసే వ్యాపారులు కాశిబుగ్గ ప్రాం తంలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సంపేట, మహబూబాబాద్ వైపు గుట్కాలు సరఫరా చే సే వ్యాపారులు గీసుగొండ మండలం ధర్మారం సమీపం లో  కొత్తగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top