ఉద్యోగం ఇచ్చారు.. పోస్టింగ్ ఆపారు..

ఉద్యోగం ఇచ్చారు.. పోస్టింగ్ ఆపారు..


అతడొక అభాగ్యుడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. నోటి వద్దకు అన్నం ముద్ద వచ్చింది. ప్రాణం లేచొచ్చింది. ఆవురావురుమంటూ తినేందుకు నోరు తెరిచాడు... అంతలోనే ఆ ముద్ద వెనక్కి జరిగింది. అది ముందుకు రాదు.. వెనక్కు వెళ్లదు..! ఇక, ఆ అభాగ్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అభాగ్యులు మన జిల్లాలో 35మంది ఉన్నారు. వారి నోటి కాడి ముద్ద ఎలా దూరం దూరంగా జరిగిందో చదవండి.    



- ఖమ్మం జడ్పీసెంటర్

 

ఇదీ నేపథ్యం

జిల్లావ్యాప్తంగా 83 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకిగాను ఏపీపీఎస్సీ ద్వారా గత ఏడాది డిసెంబర్ 31ననోటిఫికేషన్ వెలువడింది. ఫిబ్రవరి 23న  పరీక్షలు జరిగారుు. మార్చి 24న ఫలితాలు వెలువడ్డాయి. అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాలను జూన్ 9న జిల్లాపరిషత్ అధికారులు పరిశీలించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 పోస్టులను భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు వచ్చారుు. జూలై 11న 83 మంది అభ్యర్థులకు అధికారులు నియూమక పత్రాలు (అపాయింట్‌మెంట్ లెటర్లు) ఇచ్చారు. వీరిలో 35మందిని ఏడు (పోలవరం ముంపు) మండలాలకు కేటారుుంచారు. వీరిని మినహారుుం చి, మిగతా 48మందికి పోస్టింగ్ ఇచ్చారు.



విభజనతో బ్రేక్

రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రాకు వెళ్లడంతో ఈ 35మంది పోస్టింగ్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వీరికి పోస్టింగ్ ఎలా ఇవ్వాలో స్పష్టత ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఈ అభ్యర్థులు నాటి నుంచి.. అంటే, గత ఐదు నెలలుగా పోస్టింగ్ కోసం జిల్లాపరిషత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని వీరు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయూంలో ఈ పరీక్షలు జరిగారు. 35 పోస్టులు ఏపీకి వెళ్లారుు. మిగిలిన 48 పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చారుు’’ అని, జిల్లాపరిషత్ అధికారులు చెబుతున్నారు. అపారుుంట్‌మెంట్ లెటర్లు అందుకున్న మిగిలిన 35మందికి పోస్టింగ్ కేటారుుంపు విషయమై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని వారు అంటున్నారు.



జిల్లా పరిషత్‌లో నిరసన

ఐదు నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నప్పటికీ తమను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఈ 35మంది అభ్యర్థులు గురువారం జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమతోపాటు అపారుుంట్‌మెంట్ లెటర్లు తీసుకున్న  48మంది ఉద్యోగం చేస్తుండగా, తాము మాత్రం ఇలా చెప్పులరిగేలా తిరుగుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వద్దకు డీపీవో రవీందర్, జిల్లాపరిషత్ ఏఓ వచ్చి సర్దిచెప్పేందుకు యత్నించారు. ‘‘35 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వం నిర్ణయూనుసారం చర్యలు తీసుకుంటాం’’ అని, వారు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం వైఖరి కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు అన్నారు. వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top