సిబ్బంది పెంపుతోనే సమస్యల పరిష్కారం

సిబ్బంది పెంపుతోనే సమస్యల పరిష్కారం - Sakshi

  • అధ్యయన కమిటీతో మహిళా పోలీసు అధికారులు

  • బంజారాహిల్స్: నగరంలోని చాలా పోలీసుస్టేష న్లలో మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న ఈ కొద్దిపాటి సిబ్బందిని కూడా బందోబస్తులకు, ధ ర్నాలు, ర్యాలీలను అడ్డుకొనేందుకు విని యోగిస్తున్నారు. ఠాణాలో మహిళా పోలీ సులు అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చే బా ధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇబ్బ డి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదులను పరి ష్కరించేందుకు అవసరమైన సిబ్బంది లేక అధికారులు అవస్థలు పడుతున్నా రు.



    మహిళా పోలీసుస్టేషన్ల సంఖ్యతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని  మహిళా పోలీసు అధికారులు కోరుతున్నారు.  మహిళల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్య యన కమిటీ సమావేశం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం జరిగింది. సీని యర్ ఐఏఎస్ అధికారి పూనం       మాలకొండయ్య తదితరుల ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో జంట క మిషనరేట్ల పోలీసు అధికారులు    అధ్య యన కమిటీకి ఇవే సూచనలు చేశారు.

     

    వసతులు లేక సతమతం...



    నగరంలోని చాలా ఠాణాల్లో సరైన టా యిలెట్ సౌకర్యాలు లేవు. దీంతో ఫిర్యా దు చేసేందుకు వచ్చే మహిళలతో పాటు మహిళా    పోలీసులు  ఇబ్బంది పడుతున్నారు.  కొన్ని స్టేషన్లలో ఉమెన్స్ హెల్ప్ డెస్క్‌లు ఉన్నా... సరైన సౌకర్యాలు లేవు. మహిళా ఫిర్యాదుదారులు అందరినీ దాటుకొని అక్కడికి రావాల్సి వస్తోంది. విచారణకు కూడా ప్రత్యేక వసతి సదుపాయాలులేవు.  అధ్యయన కమిటీ.. పో లీసు అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

     

    ఠాణాల సంఖ్య పెంచాలి...

    నగరంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నివారించేందుకు మహిళా పోలీస్‌స్టేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. అంతేకాకుండా ప్రజాఅవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించాలి. ఇక ఫిర్యాదులకు అనుగుణంగా మహిళా సిబ్బంది సంఖ్య ఉండటం లేదు. దీనిపై ఖచ్చితంగా దృష్టిసారించాలి.     

     - రజిత, సౌత్‌జోన్ ఉమెన్ పోలీస్‌స్టేషన్

     

    వైద్య పరీక్షల్లో జాప్యం తగ్గించాలి...

    మహిళా బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లే సమయంలో వివిధ పరీక్షలకు సమయం విపరీతంగా ఖర్చవుతోంది. దీనివల్ల అటు బాధితులు, ఇటు శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ జాప్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా బాధితుల విషయంలో అన్ని వైద్యసేవలు ఒకేసారి పూర్తయ్యేలా చొవర చూపాలి.

     - మాధవీలత, సరూర్‌నగర్ ఉమెన్ పోలీస్‌స్టేషన్

     

    వెంటనే స్పందిస్తున్నాం...

    చిన్న చిన్న ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నాం. నిర్భయ ఘటన తర్వాత మహిళా సమస్యలపై మాదాపూర్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న నేను నిత్యం 20కిపైగా ఫిర్యాదులు అందుకుంటున్నాను. మిస్డ్‌కాల్స్, బ్లాంక్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఇలా అపరచిత వ్యక్తుల నుంచి వచ్చే కేసులు ఎక్కువగా మా దృష్టికి వస్తున్నాయి. వీటన్నింటిని సానుకూలంగా విని పరిష్కారిస్తున్నాం. నిందితులను అరెస్ట్ చేస్తున్నాం.

     - మధులత, పోలీసు అధికారి, సైబరాబాద్ కమిషనరేట్

     

     బాధితులు ధైర్యంగా ఠాణాకు వచ్చేలా చేయాలి...

     మహిళా బాధితులు ధైర్యంగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో చెప్పుకొనే పరిస్థితులను పెంపొందించాలి. వారి సమస్యను సానుకూలంగా విని పరిష్కరించడంలో వేగం చూపాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలి. నేరస్థులకు శిక్ష పడటంలో చొరవ చూపితే బాధిత మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి వస్తారు.

         - వెంకటలక్ష్మి, సీసీఎస్, ఉమెన్స్ పోలీస్‌స్టేషన్

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top