చెరువుకట్టలను తీర్చిదిద్దాలి

చెరువుకట్టలను తీర్చిదిద్దాలి - Sakshi


- పర్యాటక కేంద్రాలుగా మార్చాలి

- ‘హరితహారం’ను విజయవంతం చేయూలి

- భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు

- మంత్రులు రామన్న, పద్మారావుతో కలిసి పర్యటన

నెక్కొండ/నల్లబెల్లి/చెన్నారావుపేట/దుగ్గొండి:
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు నిర్వహించిన చెరువు కట్టలపై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు కోరారు. చెరువు కట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించా రు. మంత్రులు జోగు రామన్న, టి. పద్మారావుతో కలిసి మంగళవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చెరువు కట్టలపై ఈత, తాటి, టేకు మొక్కులు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెక్కొండలో హరీష్‌రావు మాట్లాడారు.



గ్రామీణులకు జీవనాధారంగా చెరువులను మార్చి అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బండ్‌కు ఇరువైపులా నాటే మొక్కలను గౌడ కులస్తులు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు సూచించారు. హరత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. నెక్కొండలోని తెలంగాణ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు హరితహారం ర్యాలీ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావుకు సమస్యలు విన్నవించారు.

 

గీత కార్మికుల బతుకులు బాగు పడాలె


మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులు, చెరువు కట్టలపై ఈత, తాటి వనాల పెంపకంతో గీత కార్మికుల బతుకులు బాగుపడాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. చెన్నారావుపేట మండలం వుగ్దుంపురం, గురిజాలలో పర్యటించారు. గురిజాలలో వుహిళలు బతుకవ్ము, బోనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. ‘గురిజాల గ్రావూన్ని వురువలేం..పల్లెనిద్ర చేసింది గుర్తుంది..తప్పనిసరిగా వుుఖ్యవుంత్రి కేసీఆర్ వురల వస్తాడు.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేస్తాం’ అన్నారు. పింఛన్లు ఇప్పించాలంటూ మంత్రులకు పలువురు వృద్ధులు వినతిపత్రాలు అందించారు.

 

దుగ్గొండిలో..

దుగ్గొండి మండలంలో మిషన్ కాకతీయలో భాగంగా 10 చెరువులను పునరుద్ధరించారు. ఈ చెరువు కరకట్టలపై స్థానిక గౌడ కులస్థులతో మంగళవారం మొక్కలు నాటిం చారు. వెంకటాపురం పెద్దచెరువు, దుగ్గొండి పెద్దచెరువుల వద్ద, తిమ్మంపేట గుండం చెరువు కట్టలపై మంత్రులు హరీష్‌రావు, పద్మారావు, జోగు రామన్న మొక్కలు నాటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో 60 చెరువులపై ఒకేసారి లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి రామన్న అభినందించారు. జిల్లాలో ఇప్పటికే 1.17 కోట్ల మొక్కలు నాటడం పూర్తి అయిందన్నారు.



మానుకోట ఎంపీ అజ్మీర సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపెల్లి రవీందర్‌రావు, ఆర్డీఓలు భాస్కర్‌రావు, రామకృష్ణారెడ్డి, డీఎస్పీ మురళీధర్‌రావు, నెక్కొండ ఎంపీపీ గటిక అజయ్‌కుమార్, జెడ్పీటీసీ బక్కి కవిత, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు షేక్ అబ్దుల్‌నభి,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు హంస విజయురావురాజు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

 

పార ఎందుకు తెచ్చుకోలేదు?

నల్లబెల్లి మండలం నారక్కపేట లచ్చిరెడ్డికుంట కట్టపై మొక్కలు నాటేందుకు పార లేకపోవడంతో  అటవీశాఖ అధికారులపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా లేవని అసహనం ప్రదర్శించారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మరావు, టీఆర్‌ఎస్ నర్సంపేట నియోజక వర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. చెరువు ఆయకట్టు, చెరువు శిఖం వివరాలను సర్పంచ్ మోర్తాల రామారావును మంత్రి అడిగి తెలుసుకొన్నారు. మొక్కలు నాటడం పూర్తయ్యేవరకు అటవీశాఖ అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు.   అంతకు ముందు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వరంగల్ సౌత్ డీఎఫ్‌ఓ కిష్టా, నర్సంపేట ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ సుధీర్, ఎంపీపీ బానోతు సారంగపాణి, తాహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీఓ మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top